Nepal : దారుణం .. మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలపెట్టారు!

నేపాల్ లో మరో దారుణం జరిగింది. ఖాట్మండులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తమ ఇంటికి నిప్పు అంటించడంతో మాజీ ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్ భార్య రబీ లక్ష్మీ చిత్రాకర్ దల్లులోని తీవ్ర గాయాలతో మరణించారు.

New Update
pm nepal former

నేపాల్(Nepal) లో మరో దారుణం జరిగింది. ఖాట్మండులో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు తమ ఇంటికి నిప్పు అంటించడంతో మాజీ ప్రధాన మంత్రి ఝలనాథ్ ఖనాల్ భార్య రబీ లక్ష్మీ చిత్రాకర్ దల్లులోని తీవ్ర గాయాలతో మరణించారు. మంటల్లో చిక్కుకున్న ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించామని, అయితే ఆమె గాయాల నుండి బయటపడలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని(Social Media Platforms Ban) ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, నేపాల్‌లో జనరల్-జెడ్ నేతృత్వంలోని నిరసనలు రెండవ రోజు హింసాత్మకంగా కొనసాగుతున్న తరుణంలో ఈ దాడి జరిగింది. 

నేపాల్ ఉద్రిక్తతల  నేపథ్యంలో భారత్‌ అప్రమత్రమైంది.  నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది.  భారతీయులెవరూ బయటకు రావొద్దని పిలుపునిచ్చింది.  పశ్చిమబెంగాల్‌లో నేపాల్ సరిహద్దులను మూసివేసింది ప్రభుత్వం. 

Also Read :  నేపాల్ ప్రెసిడెంట్ రాజీనామా!

Nepal Former PM's Wife Passes

Also Read :  నేపాల్ మంత్రిని పరిగెత్తించి కొట్టిన జనాలు.. వీడియో వైరల్!

ప్రభుత్వం ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, వాట్సాప్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ నేపాల్ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.  నిరసనలు హింసాత్మకంగా మారడంతో, నిరసనకారులు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనాన్ని ముట్టడించేందుకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటనల్లో దాదాపు 20 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. 

పరిస్థితి చేయి దాటిపోవడంతో

పరిస్థితి చేయి దాటిపోవడంతో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ ప్రధాని ఓలీని రాజీనామా(resign) చేయమని సూచించినట్లు సమాచారం. దేశంలో శాంతిని పునరుద్ధరించడానికి ప్రధాని రాజీనామా చేయడమే ఏకైక మార్గమని సైన్యం తెలిపినట్లు తెలుస్తోంది. సైన్యం సూచన మేరకు ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు తాను రాజీనామా చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 

ఓలీ రాజీనామాకు ముందు హోంమంత్రి రమేష్ లేఖక్, వ్యవసాయ శాఖ మంత్రి రామ్ నాథ్ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రధాని ఓలీ దేశం విడిచి దుబాయ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని, వైద్య చికిత్స పేరుతో ఆయన దుబాయ్ వెళ్లేందుకు ప్రైవేటు ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. 

Advertisment
తాజా కథనాలు