రన్‌ వే పై విమానం ఉండగానే..మరో విమానం టేకాఫ్‌..తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం!

మరో పెద్ద విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో తాజాగా ఈ ఘటన జరిగింది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ అయ్యింది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అలర్ట్‌ అయ్యి ప్రమాదాన్ని తప్పించారు.

New Update
planee

planee

Flight Accident: గత కొద్ది రోజులుగా వరుస విమాన ప్రమాదాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి.తాజాగా మరో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. ఓ విమానం రన్‌వేపై ఉండగానే మరో విమానం టేకాఫ్ కావడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆందోళన పడి ‘స్టాప్, స్టాప్, స్టాప్’ అని పైలట్‌ కు  హెచ్చరికలు జారీ చేశాడు. 

Also Read: Plane Crash: దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం

అయితే, వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందిన గోంజగ విశ్వ విద్యాలయం మెన్స్ బాస్కెట్ బాల్ టీమ్ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ జెట్ రన్‌వేపై ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే, జస్ట్‌ ఒక్క క్షణంలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్

దీనిపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. లాస్ ఏంజిల్స్ లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆ సమయంలో రన్‌వే నుంచి రెండో విమానం టేకాఫ్ అవుతుండడంతో రన్‌వేని దాటకుండా ఉండాలని బాస్కెట్ బాల్ టీమ్ సభ్యులున్న ‘కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563’ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఆదేశాలు ఇచ్చారు. కానీ, అదే సమయంలో ఎంబ్రేయర్ ఈ135 విమానం టేకాఫ్ కావడంతో అలర్టైన సిబ్బంది స్టాప్, స్టాప్, స్టాప్ అంటూ ప్రైవేట్ క్యారియర్‌ పైలట్‌కు హెచ్చరించడంతో.. పెద్ద  ప్రమాదం తప్పింది. 

Also Read: TG Crime: గురుకులాల్లో ఆగని మరణాలు... ఖమ్మంలో మరో విద్యార్థి ఆత్మహత్య

దీంతో మొదటి విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ప్రైవేట్ జెట్ టేకాఫ్ అయిందని అధికారులు తెలిపారు.

Also Read: అసలేం జరిగిందీ..నేనెక్కడున్నాను...జెజు ఫ్లైట్ మృత్యుంజయుడు

Advertisment
తాజా కథనాలు