Bangladesh Trade: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం

1971లో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం బంగ్లాదేశ్ పాక్‌తో వ్యాణిజ్యం చేస్తోంది. పాకిస్థాన్ నుంచి 50వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలుకు బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకుంది. ఖాసిం పోర్టు నుంచి పాకిస్థాన్ ప్రభుత్వ అనుమతి పొంది ఫస్ట్ కార్గో షిప్ బయలుదేరింది.

New Update
Bangladesh trade

Bangladesh trade Photograph: (Bangladesh trade)

Bangladesh trade: పాకిస్థాన్‌ నుంచి 1971లో బంగ్లాదేశ్ విడిపోయింది. అంతకు ముందు బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్థాన్‌గా ఉండేది. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు అంతగా లేవు. ఇరు దేశాల్లో ముల్లీం జనాభానే ఎక్కువగా ఉన్నా.. శత్రు దేశాలుగానే ఉండేవి. మొదటి సారిగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య వాణిజ్యం జరుగుతోంది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాతి నుంచి బంగ్లాదేశ్ పాక్‌తో సక్యంగా ఉంటుంది. ఈక్రమంలోనే బంగ్లాదేశ్ పాకిస్థాన్‌ నుంచి 50వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఖాసిం పోర్టు నుంచి పాకిస్థాన్ గవర్నమెంట్ అనుమతి పొంది ఫస్ట్ కార్గో షిప్ బయలుదేరింది.

Also Read : కేసీఆర్‌కు BC సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ లేఖ

1971 విడిపోయిన తర్వాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదటిసారిగా ప్రత్యక్ష వాణిజ్యం చేస్తున్నాయి. ఫిబ్రవరి ప్రారంభంలో ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేయడానికి బంగ్లాదేశ్ ఒప్పందం ఖరారు చేసుకుంది. సరుకు మోసుకెళ్తున్న పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్ (PNSC) నౌక బంగ్లాదేశ్ ఓడరేవులో బియాన్ని దిగుమతి చేయనుంది. ఈ రవాణా రెండు దశల్లో పూర్తవుతుంది. మిగిలిన 25వేల టన్నుల బియ్యాన్ని పాకిస్థాన్ మార్చిలో పంపనుంది. పాక్, బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా లేని వాణిజ్యం ప్రారంభం ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో ఈ అభివృద్ధి సానుకూలంగా కనిపిస్తుంది. ఇరు దేశాల వ్యాపార సంబంధాలు మరింత బలపడనున్నాయి.

Also Read : ఇండియాపై ఇంత ప్రేమా.. ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక గురించి తెలిస్తే షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు