యుద్ధంలో రూ.18.87 లక్షల కోట్లు నష్టం.. ట్రంప్‌పై అమెరికా ప్రజలు ఫైర్

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ చర్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అమెరికా అక్షరాలా రూ.6,900 కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు ట్రంప్‌పై అమెరికా ప్రజలు మండిపడుతున్నారు.

New Update
_War expenses

మధ్యప్రాచ్యంలో మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తూ దాడులు జరుగుతున్నాయి. అగ్రరాజ్యం ఇజ్రాయె‌ల్‌కు సపోర్ట్‌ చేస్తూ వేల కోట్లు బూడిదలో కుమ్మరిస్తున్నాయి. అమెరికా ఆధిపత్యం కోసం ప్రజల నుంచి ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన కోట్ల డాలర్లు ఇలా యుద్ధంలో వృథా చేయడం ఆ దేశ ప్రజలకు నచ్చడం లేదు. ట్రంప్ విధానాలను అమెరికా మేధావులు విమర్శిస్తున్నారు. ట్రంప్ దేశాల మధ్య యుద్ధాలు ప్రోత్సహిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థకి గండికొడుతున్నారని అక్కడి పౌరులు ఫైర్ అవుతున్నారు. అమెరికా చేస్తున్న దాడులపై ఆయా దేశాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది.

24 గంటల్లో ట్రంప్ రూ.6,900 కోట్లు ఖర్చు

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ చర్య ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారంగా మారుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అమెరికా అక్షరాలా రూ.6,900 కోట్లు ఖర్చు చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌‌పై చేస్తున్న దాడులు అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజునే అమెరికా సుమారు $779 మిలియన్లు (రూ. 6,900 కోట్లు) వెచ్చించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం కనీసం ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉందని స్వయంగా ట్రంప్ ప్రకటించడం గమనార్హం.

సముద్రంలో ఖరీదైన పోరాటం

మధ్యప్రాచ్యంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వార్ షిప్ USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ సహా రెండు క్యారియర్ స్ట్రైక్ గ్రూపులను రంగంలోకి దించింది. 'సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ' డేటా ప్రకారం.. ఒక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ మెయిన్‌టెన్స్‌కు రోజుకు దాదాపు రూ.58 కోట్లు ($6.5 మిలియన్లు) ఖర్చవుతుంది. కేవలం సైనిక సన్నాహాలు, విమానాలు, నౌకల మోహరింపు కోసమే దాదాపు రూ.5,556 కోట్లు ($630 మిలియన్లు) వెచ్చించారు.

రూ.18.87 లక్షల కోట్ల భారీ అంచనా!

యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే అమెరికా ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ డైరెక్టర్ కెంట్ స్మేటర్స్ విశ్లేషణ ప్రకారం, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా దాదాపు $210 బిలియన్లు (రూ. 18.87 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో అక్టోబర్ 7న హమాస్ దాడి చేసినప్పటి నుండి, అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్‌కు $21.7 బిలియన్ల సైనిక సహాయాన్ని అందించింది. బ్రౌన్ విశ్వవిద్యాలయం 'కాస్ట్ ఆఫ్ వార్' రిపోర్ట్ ప్రకారం, మొత్తం ఖర్చు రూ.3 లక్షల కోట్లకు పైగానే చేరుకుంది.

యుద్ధం ఎంతకాలం?

ఈ యుద్ధం ముగింపుపై ట్రంప్ స్పందిస్తూ.. "మేము నాలుగు నుండి 5 వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నాం. అయితే ఎంత సమయం పట్టినా, ఎంత ఖర్చయినా యుద్ధాన్ని కొనసాగించే కెపాసిటీ మాకు ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం నెల రోజుల్లోనే ఇంతటి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం అమెరికా పౌరుల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు