IDF: యెమెన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ఇజ్రాయెల్, హౌతీలకు మధ్య ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హౌతీలే లక్ష్యంగా యెమెన్ రాజధానిపై ఇజ్రాయెల్ వైమానికి దాడులు జరిపింది. అధ్యక్ష భవనం, మిలటరీ స్ధావరాలు, ఇంధన స్టోరేజ్ లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. 

New Update
yemen

IDF Attack On Yemen

యెమెన్ లోని సనాలో హౌతీ ఉగ్రవాద ప్రభుత్వానికి చెందిన సైనిక లక్ష్యాలే టార్గెట్ దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వారి సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామని చెప్పింది. వాటిల్లో హైతీల అధ్యక్ష భవనం, మిలటరీ సైట్స్, అదార్, హిజాజ్ విద్యుత్ ప్లాంట్లు, ఇంధనం నిల్వ చేసే స్థలం ఉన్నాయని చెబుతోంది. ఇవన్నీ హౌతీ సైనిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని అంటోంది. 

అంతకు ముందు ఇజ్రాయెల్ పై దాడులు..

అంతకు ముందు హౌతీలు మిస్సైల్స్, యూఏవీలతో ఇజ్రాయెల్ పదే పదే దాడులు చేశారు. వాటికి ప్రతీకారంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ యెమెన్ పై దాడులు నిర్వహించింది. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఉగ్రవాద ప్రయోజనాల కోసం పౌర మౌలిక సదుపాయాలను దోపిడీ చేస్తూనే ఉన్నారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులతో సనాలో చాలా ప్రాంతాలు దెబ్బ తిన్నాయని అక్కడి మీడియా చెబుతోంది. అధ్యక్ష భవనం దగ్గరగా సహా వివిధ ప్రాంతాలలో పేలుళ్ల పెద్ద శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. 

ఇరాన్ మద్దతుగల హౌతీలు 22 నెలలకు పైగా ఇజ్రాయెల్ పై క్షిపణులు,  డ్రోన్లను ప్రయోగించారు. ఎర్ర సముద్రంలో ఓడలను లక్ష్యంగా చేసుకున్నారు. గాజా స్ట్రిప్‌లో హమాస్ తో జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా తాము ఈ దాడులను నిర్వహిస్తున్నామని హౌతీలు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు