/rtv/media/media_files/2026/02/04/gaddafi-2026-02-04-11-34-02.jpg)
Ex-Libyan Leader Muammar Gaddafi's Son Killed By Armed Gang
లిబియా నియంత పాలకుడు ముఅమ్మర్ గడాఫీ కొడుకు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ (53) దారుణ హత్యకు గురయ్యారు. వెస్ట్ లిబియాలోని జింతాన్ నగరంలో ఆయన ఇంట్లోకి చొరబడ్డ నలుగురు సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ దారుణం జరిగినట్లు తన సలహాదారు అబ్దుల్లా ఉస్మాన్ అబ్బురహీం తెలిపారు. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారనేదానిపై క్లారిటీ లేదు.
సైఫ్ అల్ ఇస్లాం ఎవరు ?
సైఫ్ అల్ ఇస్లాం తన తండ్రి ముఅమ్మర్ గడాఫీ హయాలో ఎలాంటి అధికారిక పదవిలో లేకున్నా కూడా లిబియా 'డి ఫ్యాక్టో' ప్రధానిగా ఉండేవారు. ఒకప్పుడు సంస్కరణవాదిగా పేరు తెచ్చుకున్న సైఫ్.. 2011 అరబ్ స్ప్రింగ్ తిరుగుబాటు సమయంలో అణివేతకు పిలుపునిచ్చి విమర్శలకు గురయ్యారు. అంతేకాదు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) ఆయనపై గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2011లో గడాఫీ హత్య తర్వాత సైఫ్‌ను అరెస్టు చేశారు.
Also Read: ట్రేడ్ డీల్‌లో భారత్‌కు మినహాయింపులు ..అమెరికా వాణిజ్య ప్రతినిధి కీలక ప్రకటన..
2015లో ట్రిపోలీ కోర్టు సైఫ్‌కు మరణశిక్ష విధించింది. కానీ తర్వాతి కాలంలో ఆయనకు క్షమాభిక్ష లభించింది. దీంతో చాలాకాలం పాటు సైఫ్ అజ్ఞాతంలో ఉన్నారు. అయితే 2021లో లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆ ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ఆయన భద్రతపై ఆందోళనలు ఉన్నట్లు గతకొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. సైఫ్ హత్యపై ఆయన మద్దతురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైఫ్ మృతితో లిబియా రాజకీయాల్లో మార్పులు రానున్నాయని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
గడాఫీ ఎవరు ?
ముఅమ్మర్ గడాఫీ లిబియా దేశాన్ని దాదాపు 1969 నుంచి 2011 వరకు 42 ఏళ్ల పాటు నియంతగా పాలించాడు. 1969లో ఓ సాధారణ సైనిక అధికారిగా ఉన్న గడాఫీ, అప్పటి లిబియా రాజు ఇద్రిస్‌ను తిరుగుబాటు ద్వారా గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 27 ఏళ్లే కావడం గమనార్హం. ఈయన పాలనలో లిబియాలోని చమురు బావులను జాతీయం చేశారు. అలాగే అక్కడి ప్రజలందరికీ ఉచితంగా విద్యను, వైద్యాన్ని అందించారు. గృహ వసతిని ప్రాథమిక హక్కుగా మార్చారు. తాగునీటి సమస్యను తీర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పైపులైన్ ప్రాజెక్టును నిర్మించారు.
Also Read: మరో దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్..
గడాఫీపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. తనను వ్యతిరేకించిన వారిని ఆయన అత్యంత క్రూరంగా అణచివేసేవారు. బహిరంగ ఉరిశిక్షలు, జైలు శిక్షలు విధించేవారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఉగ్రవాద సంస్థలకు ఆయన ఆర్థిక సహాయం అందించారనే ఆరోపణలున్నాయి. 1988లో జరిగిన లాకర్బీ విమానం కూల్చివేత వెనుక ఆయన హస్తం ఉందని తేలింది. అందుకే పాశ్చాత్య దేశాలు ఆయన్ని 'పిచ్చి కుక్క' అని పిలిచేవి. 2011లో మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చిన విప్లవం లిబియాకు కూడా విస్తరించింది. ప్రజలు గడాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 2011న గడాఫీ తన స్వస్థలమైన సిర్తేలో పట్టుబడ్డారు. దీంతో తిరుగుబాటుదారులు ఆయన్ను వీధిలోకి లాగి, తీవ్రంగా హింసించి కాల్చి చంపేశారు.
Follow Us