India-US Trade Deal :  ట్రేడ్‌ డీల్‌లో భారత్‌కు మినహాయింపులు ..అమెరికా వాణిజ్య ప్రతినిధి కీలక ప్రకటన..

కొన్ని వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ట్రేడ్ డీల్‌లో భారత్‌కు మినహాయింపులు కల్పించనున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్‌ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశంపై భారత్‌తో చర్చలు కొనసాగుతాయని గ్రీర్‌ తెలిపారు.

New Update
FotoJet - 2026-02-04T105649.260

India-US Trade Deal :  కొన్ని వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ట్రేడ్ డీల్‌లో భారత్‌కు మినహాయింపులు కల్పించనున్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్‌ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలోకి ప్రవేశంపై భారత్‌తో చర్చలు కొనసాగుతాయని గ్రీర్‌ తెలిపారు. కొన్ని రకాల గింజలు, వైన్, స్పిరిట్, పండ్లు, కూరగాయాలపై మాత్రం..టారిఫ్‌లు 13.5 శాతం నుంచి జీరోకు తగ్గించనున్నట్లు తెలిపారు. అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ చాలావరకు టారిఫ్‌లు తగ్గించనుందని జెమిసన్‌ గ్రీర్‌ వెల్లడించారు. అయితే, వ్యవసాయ రంగానికి సంబంధించి కొన్ని దిగుమతులపై ఈ ఒప్పందంలో భారత్‌కు కొంత నియంత్రణ, మినహాయింపులు కల్పించనున్నామని వెల్లడించారు. అయితే ఆ దిగుమతులు ఏంటనేవి నిర్ణయించేందుకు త్వరలో సమావేశమై కలిసి నిర్ణయిస్తామని చెప్పారు. అయితే.. ఇరుదేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లకు (Tariffs) సంబంధించిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదని జెమిసన్‌ గ్రీర్‌ సూచనప్రాయంగా తెలిపారు.

‘‘ఇరుదేశాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఒక అద్భుతమైన అవకాశం. అమెరికా (USA)కు ఇది భారీ విజయం. ఎందుకుంటే భారత్‌ (India)తో మాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది. తాజా ఒప్పందంతో అది తగ్గనుంది. కొన్నిరకాల వ్యవసాయ ఉత్పత్తులు, తయారీ రంగ ఉపకరణాలు, కెమికల్స్‌, వైద్య పరికరాలపై టారిఫ్‌లు తగ్గించేందుకు భారత్‌ అంగీకరించింది. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్‌లో దిగుమతి సుంకాలు సగటున 13.5 శాతంగా ఉన్నాయి. ఇప్పుడు అవి సున్నాకు తగ్గనున్నాయి. అగ్రరాజ్యానికి చెందిన కొన్ని రకాల గింజలు, వైన్‌, స్పిరిట్స్‌, పండ్లు, కూరగాయాలపై కూడా సుంకాలు జీరోకు దిగి రానున్నాయి’’ అని గ్రీర్‌ వెల్లడించడం గమనార్హం.

ఇదే సందర్భంలో రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్ల అంశాన్ని కూడా జెమిసన్‌ గ్రీర్‌ ప్రస్తావించారు. ‘‘2022-23కు ముందు మాస్కో నుంచి భారత్‌ పెద్దగా ముడిచమురు కొనుగోలు చేయలేదన్నారు. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో చమురు డిస్కౌంట్‌లో లభించడంతో అక్కడి నుంచి భారత్‌ కొనుగోలు చేపట్టింది. అయితే, గతేడాది చివరిలో మాస్కో నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి’’ అని వెల్లడించారు.
 
కాగా, భారత్‌, అమెరికా వాణిజ్య ఒప్పందంపై వైట్‌హౌస్‌ హర్షం వ్యక్తంచేసింది. అమెరికాకు చెందిన పలు రంగాల్లో భారత్‌ 500 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొంది. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత్‌ హామీ ఇచ్చింది. అదే సమయంలో అమెరికా, వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకుంటామని చెప్పింది. ఇది అగ్రరాజ్య ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చనుంది’’  అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ తెలపడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు