Sidney: ప్రయాణీకులతో బయల్దేరిన విమానం కొద్ది సేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానంలో రన్ వే పై భారీగా మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...శుక్రవారం ఇంజన్ వైఫల్యం కారణంగా, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుండి బయలుదేరిన ప్రయాణీకుల విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అదే సమయంలో రన్‌వేకు ఒకవైపు ఉన్న గడ్డిలో మంటలు చెలరేగాయని సిడ్నీ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు, సిబ్బంది మధ్య తొక్కిసలాట జరిగింది.
Also Read: Venu Swamy: వేణు స్వామికి మరోసారి నోటీసులు.. షాకిచ్చిన మహిళా కమీషన్!
ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చాలా శ్రమ తర్వాత మంటలను అదుపులోకి తెచ్చామని, అయితే విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్రిస్బేన్‌కు వెళ్లే ట్విన్ జెట్ బోయింగ్ 737-800 ఇంజిన్ లో ఒక్కసారిగా పెద్ద చప్పుడు వచ్చింది.
Also Read: Amnesia: గ్రామంలో అందరికీ మతి మరుపు..డబ్బులు లేకుండా జీవనం
అయితే ఇలా జరిగినప్పుడు అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో క్వాంటాస్ ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు వెల్లడించలేదు. క్వాంటాస్ చీఫ్ పైలట్ కెప్టెన్ రిచర్డ్ టోబియానో ఒక ప్రకటనలో ఇలా అన్నారు: “ఇది ప్రయాణికులకు భయాందోళనలు కలిగించే అనుభవం. మేము వారి పరిస్థితిని అర్థం చేసుకున్నాం. సహాయం అందించడానికి మేము సిద్దంగా ఉన్నాం.
Also Read: KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్!
ఘటనకు గల కారణాలు ఇంకా
ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఇంజిన్ సమస్యకు కారణాన్ని కూడా మేము పరిశోధిస్తాం.'' సిడ్నీ విమానాశ్రయం దాని ప్రధాన రన్‌వే ఇప్పటికీ పనిచేస్తుందని తెలిపారు. సమాంతర రన్‌వే వెంబడి గడ్డి మంటలు చెలరేగాయని, దానిని మళ్లీ ఉపయోగించే ముందు తనిఖీ చేస్తున్నామని విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!
విమాన రాకపోకలలో జాప్యం జరుగుతుందని, ప్రయాణికులు తమ విమాన స్థితిని ఎయిర్‌లైన్‌తో తనిఖీ చేసుకోవాలని సూచించామని అధికారులు తెలిపారు.