BIG BREAKING: అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించిన పాక్.. ఉద్యోగుల సెలవులు రద్దు!

పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

New Update
పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ

పైకి బీరాలు పోతున్నా పాకిస్తాన్ లోపల భయపడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. పాక్ పీవోకేలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఒకవైపు బోర్డర్ లో భారత్ చర్యలు, యుద్ధం తప్పదన్న హెచ్చరికలతో పాకిస్తాన్ అత్యవసర నిర్ణయాలను తీసుకుంటోంది. పాక్ పీవోకేలో అత్యవసర ఆంక్షులు విధించింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాటూ ఆరోగ్య కార్యకర్తల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేసింది. దీనికి సంబంధించి ఏప్రిల్ 25న జీలం వ్యాలీ హెల్త్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసుపత్రులు, ఆరోగ్య విభాగాలలోని వైద్య సిబ్బందిని వారి వారి డ్యూటీ పాయింట్ల వద్దనే ఉంచాలని ఆదేశించింది. ఇప్పటికే సెలవు మీద ఉన్నవారు కూడా వెంటనే డ్యూటీల్లో జాయిన్ అవ్వాలని చెప్పింది. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 

అప్రమత్తమైన భారత బలగాలు..

పాక్ హెల్త్ డైరెక్టరీ ఉత్తర్వులను భారత భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా పరిగణించాయి. పాకిస్తాన్ తీసుకుంటున్న ఈ చర్యలు ఎల్వోసీ దగ్గర సైనిక లేదా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్, పరిసర ప్రాంతాలలో ఇవి ఎక్కువగా జరగొచ్చని ఊహిస్తున్నారు. దీంతో భారత భద్రతా దళాలు పహల్గామ్, అనంతనాగ్ జిల్లాల్లో పెట్రోలింగ్, నిఘాను ముమ్మరం చేశాయి.  ఇక నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేసింది. భారత సైన్యం ఎటువంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | pakistan | loc | emergency 

Also Read:   J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు