Khamenei: ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఖమేనీని హత్య చేయాలనుకున్నాం, కానీ..

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని ప్లాన్ చేశామని, కానీ ఇజ్రాయిల్ ఆర్మీకి అవకాశం దొరకలేదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అన్నారు. ఖమేనీ మా పరిధిలో ఉంటే, మేము వారిని అంతం చేసేవాళ్ళమని ఇజ్రాయిల్ మంత్రి చెెప్పారు.

New Update
Israeli Defense Minister

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ముగిసిన తర్వాత కూడా రెండు దేశాల మధ్య మాటల యుద్దం ఇంకా చల్లారలేదు. ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఓ షాకింగ్ విషయాలన్ని మీడియాతో చెప్పారు. ఖమేనీని హత్య చేయాలని ప్లాన్ చేశామని, కానీ ఇజ్రాయిల్ ఆర్మీకి అవకాశం దొరకలేదని కాట్జ్ అన్నారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మా పరిధిలో ఉంటే, మేము వారిని అంతం చేసేవాళ్ళం. మా టార్గెట్ స్పష్టంగా ఉంది, కానీ మాకు అలాంటి అవకాశం లభించలేదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అన్నారు. ఖమేనీని హత్య చేయడానికి అమెరికా ఒప్పుకుందా అని అడగగా.. ఇలాంటి విషయాలకు ఇజ్రాయిల్ ఎవరి అనుమతి కోరాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ మంత్రి యోవ్ గాలంట్ ఖమేనీని ఆధునిక హిట్లర్‌తో పోల్చారు. 

Also Read :  రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. ఊహించని షాకిచ్చిన హైకోర్టు

Iran-Israel War

Also Read :  వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇలా చేసి భారీగా డబ్బులొస్తాయ్!!

ఇజ్రాయిల్ దాడులు ఉదృతం చేయగానే ఖమేనీ తన కుటుంబంతో కలిసి టెహ్రాన్‌లోని ఒక భూగర్భ బంకర్‌లో దాక్కున్నాడని తెలుస్తోంది. అందులో అతని కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి. జూన్ 13వ తేదీన ప్రారంభమైన ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత అతను ఇక్కడే ఆశ్రయం పొందాడని విశ్వసనీయ సమాచారం. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు జూన్ 19న మొదటిసారిగా టీవీలో కనిపించారు. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేసినట్లు ఖమేనీ ప్రకటించాడు. ఇరాన్ అమెరికా ముఖంపై చెంపదెబ్బ కొట్టిందని ఆయన టీవీలో చెప్పారు. రెచ్చగొడితే ఇరాన్ మరింత ప్రతీకారం తీర్చుకుంటుందని కూడా ఆయన హెచ్చరించారు.

Also Read :  సింగిల్ ఛార్జింగ్.. 500 కి.మీ మైలేజ్‌తో 2 కొత్త కార్లు.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Also Read :  వస్తున్నాయ్.. వస్తున్నాయ్ జగన్నాథుడి రథ చక్రాలొస్తున్నాయ్

Advertisment
తాజా కథనాలు