ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కెనడా పార్లమెంటరీ ఎన్నికలు కూడా దగ్గర కావస్తున్నాయి. మళ్లీ అధికారాన్ని సంపాదించుకోవాలని ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో ట్రూడో గ్యారెంటీగా ఓడిపోతారని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
సాయం చేయమని సోషల్ మీడియా ద్వారా అడగడంతో..
కెనడా ట్రూడోను వదిలించుకునేందుకు సాయం చేయండని ఓ యూజర్ సోషల్ మీడియా ద్వారా మస్క్‌కు అడిగాడు. దీనికి మస్క్ స్పందిస్తూ.. వచ్చే ఎన్నికల్లో ట్రూడో తప్పకుండా ఓడిపోతాడని సమాధానం ఇచ్చాడు.
ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కి ఎలాన్ మస్క్ సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ గెలవడంతో అమెరికాలో బిజినెస్ చేసే వారందరికీ మంచి రోజులు వచ్చాయని ఆనందపడ్డారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ కు అందరికంటే ఎక్కువ లాభపడారు. అయితే ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో మస్క్‌కు ఒకేరజులో 26 బిలియన్ డాలర్లు లాభం వచ్చింది.
ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!
టెస్లా షేర్లు 14.75 శాతం పెరిగి మస్క్ సంపద ప్రస్తుతం 290 బిలియన్ డాలర్లకు చేరుకుంది.దీంతో ఈ ఏడాదిలో మస్క్ నికర విలువ 60 బిలియన్ డాలర్లు పెరిగింది. ట్రంప్ గెలవడంతో మస్క్ ఎక్కువగా లాభపడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ 120 కోట్లు ట్రంప్‌కు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?