Elon Musk: ఆ పోస్ట్ డిలీట్.. ట్రంప్‌కు భయపడ్డ ఎలన్ మస్క్

జెఫ్రీ ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణంలో ట్రంప్‌ ఉన్నాడని ఎలన్ మస్ ఎక్స్ వేధికగా ఆరోపించారు. ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ట్రంప్ పేరు ఉందని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇటీవల ఆ పోస్ట్ పెట్టగా.. జూన్ 7న (శనివారం) డిలీట్ చేశారు. 

New Update

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీకి తొడుగా ఉన్న ఎలన్ మస్క్.. గతకొన్నిరోజులుగా ట్రంప్ నిర్ణయాలకు అడ్డు తగులుతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈక్రమంలో జెఫ్రీ ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణంలో ట్రంప్‌ ఉన్నాడని ఎలన్ మస్ ఎక్స్ వేధికగా ఆరోపించారు. ఎప్‌స్టైన్‌ సెక్స్ కుంభకోణం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లో ట్రంప్ పేరు ఉందని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇటీవల ఆ పోస్ట్ పెట్టగా.. జూన్ 7న (శనివారం) డిలీట్ చేశారు. 

అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ.. ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు ఎలాన్‌ మస్క్‌. వెంటనే సెక్స్‌ కుంభకోణంపై చేసిన పోస్ట్‌ ఆయన డిలీట్‌ చేశారు. ఎలాన్‌ మస్క్‌ ట్రంప్‌కు భయపడ్డాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా ఎలన్ మస్క్‌ ట్రంప్‌ను భయపెట్టడానికి ఇలా పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడా అని సందేహాలు వస్తున్నాయి. అందరికీ సుంకాలు, నిబంధనలు అని షాక్ ఇస్తున్న ట్రంప్‌కు ఎలన్ మస్క్ ఆరోపణలకు బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. 

 Elon Musk | 47th us president donald trump | trump | elon musk X post | Jeffrey Epstein sex scandal | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు