భారీ భూకంపం.. 200 మందికి పైగా మృతి

మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భారీ భూకంపానికి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

New Update
Earth Quake

Earth Quake Photograph: (Earth Quake)

మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భారీ భూకంపానికి తీవ్రంగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే భూకంపం సంభవించడంతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. రెండు దేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా రోడ్లు బీటలు వారాయి. బిల్డింగ్‌లు అన్ని కూడా కుప్పకూలాయి.

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

భారీ భూకంపం సంభవించడంతో..

శిథిలాల కింద ఎందరో ప్రజలు చిక్కుకుని ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలడంతో శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కూడా కుప్పకూలింది. రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

భూ ప్రకంపనల దాటికి అనేక భవనాలు ఊగిపోయాయాయి. పలు భవనాలు కూలిపోయాయి. అయితే నిర్మాణంలో ఉన్న ఓ ఎత్తైన భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు థాయ్‌లాండ్ రక్షణశాఖ మంత్రి వెల్లడించారు. మరో 90 గల్లంతయినట్లు పేర్కొన్నారు. మరోవైపు థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర బ్యాంకాక్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అలాగే అక్కడ మెట్రో, రైలు సేవలు కూడా నిలిపివేశారు. 

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు