Trump: వెనక్కి తగ్గిన ట్రంప్.. ఇరాన్‌కు సంచలన లేఖ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత పగలు మర్చిపోదామంటూ ఇరాన్‌కు లేఖ రాశారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీకి ఈ లేఖను పంపించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. శుక్రవారం ఫాక్స్‌ బిజినెస్‌ నెట్‌వర్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం ఇరాన్‌కు లేఖ పంపించినట్లు తెలిపారు. వాళ్లు చర్చిస్తారని మేము ఆశిస్తున్నామని.. ఇది ఇరాన్‌కు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోందని చెప్పారు. 

Also Read: ఆస్తికోసం సొంత అన్న.. అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్... పోలీసుల ఎంట్రీతో...

ఇదిలాఉండగా.. ఇజ్రాయెల్ హమాస్‌ మధ్య యుద్ధం ప్రారంభమైన అనంతరం హమాస్‌కు ఇరాన్‌ సపోర్ట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా భీకర దాడులు జరిగాయి. ఇందులో అమెరికా కూడా జోక్యం  చేసుకోవడంతో.. ఇరాన్, అమెరికా మధ్య వైరం మరింత పెరిగింది. దీంతో ఇరాన్‌పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశానికి చెందిన పెట్రోలియం, పెట్రో కెమికల్ రంగాలపై ఆంక్షలు విధించింది. అయితే తాజాగా ట్రంప్‌.. ఇరాన్‌కు చర్చలకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

హమాస్‌ మరోసారి ట్రంప్ వార్నింగ్‌ను పక్కనపెట్టింది.  గాజాలో శాశ్వతంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పుడే మిగిలిన బందీలను విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై విమర్శలు గుప్పించింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు యత్నిస్తున్నట్లు హమాస్ ఆరోపించింది. రెండో దశపై చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు