/rtv/media/media_files/2025/10/01/trump-meet-2025-10-01-08-03-44.jpg)
President Trump Meet With Genarals and admirals
తన సొంత ప్రజలపైనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనాన్ని ఉపయోగించాలనుకుంటున్నారా...అవును దీనికి సంబంధించి ఆయనే స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. దేశం ఇప్పుడు అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కోంటోందని...అమెరికన్ నగరాలను సైన్యానికి శిక్షణా స్థలాలుగా ఉపయోగించాలని అందులో ఆయన సూచించారు. కొన్ని నగరాల్లో నేరాలు పెరుగుతున్నాయని...వాటిని అణిచివేయడానికి ట్రంప్ అదనపు సైన్యాలను మోహరించనున్నారు. దీనిపై తాజాగా ఆయన అమెరికా అత్యున్నత సైనిక అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశ జనరల్స్ ను వెనక్కు రప్పిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
సైన్యం ఆధీనంలో ప్రధాన నగరాలు..
ట్రంప్ ఇప్పటికే వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ లలో నేషనల్ గార్డ్ లను మోహరించారు. వాటితో పాటూ మెంఫిస్, పోర్ట్ ల్యాండ్ లలో కూడా సైన్యాన్ని దించారు. వీటిని యుద్ధ మండలాలు అని అభివర్ణించారు. షికాగోలో కూడా నేరాలు చాలా ఎక్కువ అయిపోతున్నాయని అక్కడకు నేషనల్ గార్డ్స్ ను పంపిస్తాయనని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రకటించారు. ట్రంప్ సైన్యాన్ని మోహరించిన నగరాలు అన్నీ డెమోక్రాట్ల పాలనలో ఉండడం గమనించదగ్గ విషయం. షికాగో గురించి ట్రంప్ మాట్లాడుతూ అక్కడి గవర్నర్ కు తమ సహాయం అవసరమని అన్నారు. తొందరలోనే అక్కడ పరిస్థితి చక్కబరుస్తానని అన్నారు. వాషింగ్టన్ డీసీలో కేంద్ర బలగాలను దించి ఎలా వేగంగా సమస్యను పరిష్కరించామో...షికాగోలో కూడా అదే చేస్తామని అన్నారు. త్వరలోనే షికాగో సురక్షిత నగరంగా మారుతుందని అన్నారు.
సైనిక అధికారులతో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ తో పాటూ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ కూడా పాల్గొన్నారు. సైనిక అధికారులు ఇక మీదట నిర్లక్యంగా ఉంటే సహించమని ఆయన చెప్పారు. పెంటగాన్ వీధుల్లో అధిక బరువు ఉన్న జనరల్స్, అడ్మిరల్స్ తిరిగడం ఇకపై ఆమోద యోగ్యం కాదని హెచ్చరించారు. ప్రస్తుతం అన్ని రకాలుగా విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో ట్రంప్ ఈ రకంగా సైనిక సమావేశం నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యూఎస్ లో అంతర్యుద్ధం తప్పదనే వాదన వినిపిస్తోంది. దానికి తోడు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ చార్లెస్ బ్రౌన్ సహా పలువురు ఉన్నత సైనిక అధికారులను ట్రంప్ ఇటీవల తొలగించడం కూడా అనుమానాలకు తావునిస్తోంది.
Also Read: USA: షట్ డౌన్ దిశగా అమెరికా ప్రభుత్వం..చిక్కుల్లో ట్రంప్