అమెరికన్లకు సువర్ణ యుగం: ట్రంప్ తొలి స్పీచ్ అదుర్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆపార్టీ విజయం సాధించడంతో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని తెలిపారు. By Seetha Ram 06 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలుపొందారు. ఇందులో భాగంగానే తమ పార్టీ విజయం సాధించడంతో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేకాకుండా అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందంటూ హామీ ఇచ్చారు. Also Read: భారీగా పెరగనున్న మద్యం ధరలు! ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు చాలా బాగా పోరాడారన్నారు. ఈ మేరకు ఘన విజయాన్ని అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా స్వింగ్ రాష్ట్రాల్లో విజయం రెట్టింపు ఆనందాన్నిచ్చిందన్నారు. అమెరికా కోలుకునేందుకు ఈ గెలుపు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. Also Read: ఒక్క అడుగు...కానీ స్వింగ్ స్టేట్స్ లోనే అసలు విషయం...! ఈ మేరకు తనకు మద్దతుగా నిలిచిన వారికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సరిహద్దుల మూసివేతను పరిశీలించాలని అన్నారు. ఎవరైనా చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని పేర్కొన్నారు. ఇక అమెరికా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్.. ఎలాన్ మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. Donald Trump gives his victory speech after being elected. 🇺🇸pic.twitter.com/LYl7ZPTnQn — DramaAlert (@DramaAlert) November 6, 2024 Also Read: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ ఇదిలా ఉంటే ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లతో విజయ దుందుభి మోగించారు. కమలా హారిస్‌కు 226 ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంతో ముఖ్యమైన స్వింగ్ స్టేట్స్ ఫలితాల్లో కాస్తా అటు ఇటు అయినప్పటికీ కూడా ట్రంప్ నే విజయం వరించింది. ముందు నుంచి కూడా ఎన్నికల్లో గెలుపు మీద ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అనుకున్నట్లుగానే ఆయనే గెలిచారు. మరి ఈ విజయం తో ట్రంప్ 2.o..పాలన పై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. Also Read: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! కమలా హారీస్ ప్రసంగం రద్దు మరోవైపు కమలా హారీస్ మద్దతుదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఇందులో భాగంగానే కమలా హారిస్ ప్రసంగం వాషింగ్టన్‌లోని హూవార్డ్ యూనివర్సిటీలో జరగాల్సి ఉంది. కానీ కమలా హారిస్ మాత్రం ఆ ప్రసంగానికి హాజరుకాకుండా తిరిగొచ్చేశారు. దీనిపై కమలా హారిస్ సహచరుడు సెడ్రిక్ రిచ్‌మండ్ హూవార్డ్ వద్ద మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉందని.. అందుకే ఇవాళ కమలా హారిస్ ప్రసంగం లేదని క్లారిటీ ఇచ్చారు. #trump #kamala-haaris #us election 2024 final result మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి