Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్

AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. మరియమ్మ హత్య కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

New Update
SURESH NANDI

Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ కు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. మరియమ్మ హత్య కేసులో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే ఇటీవల ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సురేష్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. కాగా  ప్రస్తుతం వైసీపీ మాజీ ఎంపీ సురేష్ గుంటూరు జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read :  బాలీవుడ్ 'రామాయణం' పై అదిరిపోయే అప్డేట్.. 2 పార్టులుగా..పోస్టర్ వైరల్

ఇటీవల అస్వస్థత...

గుంటూరు జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ఇటీవల అస్వస్థత గురయ్యారు. సురేష్‌ను జీజీహెచ్‌కు తరలించారు  జైలు అధికారులు.  ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు బీపీ, షోల్డర్ పెయిన్, చెస్ట్ పెయిన్ అని జైలు అధికారులకు సురేష్ చెప్పారు. అరెస్టు సమయంలోనే షోల్డర్ పెయిన్ ఉందని పోలీసులకు సురేష్ చెప్పినట్లు సమాచారం. పూర్తి స్థాయి వైద్య పరీక్షల కోసం జీజీహెచ్‌కు తరలించారు జైలు సిబ్బంది. కాగా ఆయన కోలుకున్నారు.

Also Read :  వాహనదారులకు షాక్.. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎంతంటే!

గతంలో అరెస్ట్..

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్‌ పై కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ను హైకోర్టుకొట్టేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న నందిగం సురేష్ ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఇది ప్రభుత్వ కుట్ర అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.  

Also Read :  Africa ఎంగోంగా లిస్ట్‌ లో ఏకంగా అధ్యక్షుడి సోదరి పోలీస్‌ అధికారి భార్య

Also Read :  గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువ ఆకలి అవుతుందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు