BIG SHOCK: భారీగా పెరగనున్న మద్యం ధరలు!

TG: రాష్ట్రంలో లిక్కర్​ రేట్లను పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీర్​పై రూ.15–20, క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.10 నుంచి రూ.80 వరకు పెంచేలా ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

New Update
Liquor Shop Timings

Liquor Prices Hike: మద్యం ప్రియులకు షాక్ ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. త్వరలో మద్యం ధరలు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ధరల పెంపుపై ఎక్సైజ్​ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం. అయితే.. బీర్​పై రూ.15–20,  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.10  నుంచి రూ.80  వరకు పెంచేలా ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

రూ.700 కోట్ల  మేర...

కాగా రోజు వారి కూలీలు ఎక్కువగా తాగే చిప్ లిక్కర్ పై  ప్రభుత్వం కనికరం చూపనుంది. చిప్ లిక్కర్ బ్రాండ్ల పై ధరలు పెంచొద్దు అనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చిప్ లిక్కర్ బ్రాండ్లపై కాకుండా ఇతర బ్రాండ్లపై ఎక్కువ పెంచేలా ప్రపోజల్స్​ ను అధికారులు  సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మద్యం ధరలను యావరేజ్​గా 20 శాతం నుంచి 25 శాతం మేర పెంచడం ద్వారా ప్రతినెలా రూ.500  కోట్ల  నుంచి రూ.700 కోట్ల  మేర అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని సర్కార్ భావిస్తోంది.

ప్రభుత్వానికి రూ.39వేల కోట్లు...!

మద్యం పై ధరలు పెంచడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ద్వారా వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు  ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మరో రూ.8,040 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండిటి నుంచి మొత్తం  రూ.17,533 కోట్ల రాబడి వచ్చినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన 6 నెలల్లో ఇదే మొత్తంలో వస్తుందని అంచనా వేస్తే, ఈ ఆర్థిక సంవత్సరం రూ.35,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు