Donald Trump : ఇజ్రాయెల్ పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మ తిరిగే షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ట్రంప్  ప్రసంగిస్తుండగా..  ఇద్దరు పార్లమెంటు సభ్యులు దూకుడుగా ప్రవర్తించి, ఆ ప్రసంగానికి అంతరాయం కలిగించారు.

New Update
trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump) కు ఇజ్రాయెల్ పార్లమెంట్(Israel Parliament) లో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ట్రంప్  ప్రసంగిస్తుండగా..  ఇద్దరు పార్లమెంటు సభ్యులు దూకుడుగా ప్రవర్తించి, ఆ ప్రసంగానికి అంతరాయం కలిగించారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ జాతిహత్య అంటూ నినాదాలు చేశారు. వెంటనే వారిని స్పీకర్ అమిర్ ఒహానాఆదేశాలతో పార్లమెంటు అంతస్తు నుండి బయటకు తీసుకెళ్లారు. వారిని ఇజ్రాయెల్‌లోని హడాష్ పార్టీకి చెందిన అరబ్-ఇజ్రాయెల్‌కు చెందిన అయిమాన్ ఉడా, అతని సహోద్యోగి యూదు ఇజ్రాయెల్‌కు చెందిన ఓఫర్ కాసిఫ్‌గా గుర్తించారు. ట్రంప్ తన ప్రసంగంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు(netanyahu) ను అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు.

Also Read :  Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇచ్చారు, ట్రంప్‌ను ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారానికి నామినేట్ చేస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో జరిగిన గాజా శాంతి ఒప్పంద కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో నెతన్యాహు మాట్లాడుతూ..  ఇజ్రాయెల్ బహుమతిని అందుకోవడానికి ట్రంప్ పేరును సమర్పించానని, ఈ అవార్డుకు అందుకోబోతున్న మొదటి ఇజ్రాయెలేతర వ్యక్తి ట్రంప్ అని ఆయనను అభివర్ణించారు. ఇటీవల గాజా కాల్పుల విరమణను సాధించడంలో మరియు జీవించి ఉన్న బందీలందరినీ విడుదల చేయడంలో ట్రంప్ గుర్తింపుగా నెతన్యాహు ఈ ప్రకటన చేశారు. 

ట్రంప్ సంచలన కామెంట్స్

మరోవైపు పాక్-ఆప్ఘాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ఏడు యుద్ధాలను ఆపా, ఎనిమిదో యుద్ధం ఆపుతున్నానని అన్నారు. త్వరలోనే పాక్-ఆప్ఘాన్ యుద్ధాన్నీ ఆపేస్తానని జోస్యం చెప్పారు. టారిఫ్స్ తో కూడా యుద్ధాలను ఆపానని ట్రంప్ వ్యాఖ్యనించారు. 100 నుంచి 200 టారిఫ్స్ వేస్తానంటే మోదీ భయపడ్డాడని ఆరోపించాడు. అటు పాక్ కూడా భారత్ పై యుద్ధానికి భయపడేలా చేశానన్నారు ట్రంప్. 

Also read : Trump in Israel: ట్రంప్‌కు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్‌ కనేసేట్‌ స్టాండింగ్‌ ఓవేషన్‌

Advertisment
తాజా కథనాలు