ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం జరిగింది. చదువుతో పాటుగా మంచి చెడులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాధిత విద్యార్థి.. తిరిగి స్కూల్‌కు వెళ్లనంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తనను వేరే స్కూల్ లో చేర్చాలని ఏడ్చు్కుంటూ వాపోయాడు. ఎందుకని అతని తల్లిదండ్రులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కూమారుడు చెప్పిన నిజంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. జువాలజీ టీచర్ తనను లైంగికంగా,అసభ్యంగా వేధిస్తున్నాడని పేరెంట్స్‌కు కుమారుడు తెలిపింది.
టీచర్‌పై పొక్సో కేసు నమోదు
దీంతో కుమారుడిని తీసుకుని స్కూల్ ప్రిన్సిపల్‌కు వెంటనే ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో జువాలజీ టీచర్‌పై పొక్సో కేసు నమోదు అయింది. అంతేకాకుండా సర్వీస్ నుంచి అతన్ని రిమూవ్ చేశారు ఉన్నతాధికారులు. విషయం బయటకు రావడంతో అవమానంతో ఆ ఉపాధ్యాయుడు ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. పురుగులు మందు తాగాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి మైనర్ కావడంతో విషయం బయటకు రాకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు ఓ కమిటీని కూడా వేశారు.