USA: వివేక్ రామస్వామికి ట్రంప్ కేబినెట్‌లో కీలక పదవి..

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం డొనాల్డ్ ట్రంప్‌కు మొదట్లో గట్టిపోటీ ఇచ్చిన వ్యక్తుల్లో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి ఒకరు. ఇప్పుడు ఇతనికి ట్రంప్ తన కేబినెట్‌లో కీలక పదవి ఇచ్చారు.

Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వివేేక్‌ రామస్వామి ఔట్..
New Update

Vivek Rama Swamy : 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి కూడా పోటీ చేశారు. కొన్ని నెలల పాటూ ప్రచారం కూడా చేశారు. తర్వాత తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌కు మద్దుతు ఇస్తున్నాని కూడా చెప్పారు. అమెరికాలో రామస్వామికి రోవాంట్ సైన్సెస్ అనే బయోటెక్ కంపెనీ ఉంది. ఇప్పుడు టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ హెడ్‌గా డొనాల్డ్ ట్రంప్ నియమించిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి. వివేక్‌ను గొప్పదేశభక్తుడు అని ట్రంప్ పొగిడారు.

Also Read :  వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో పిల్.. చివరికీ

అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోజ్‌ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. సమర్థత ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థలో మస్క్ , వివేక్‌ మార్పులు తెస్తారని ఆశిస్తున్నా. ముఖ్యమైన విషయమేంటంటే.. ఏటా ప్రభుత్వం ఖర్చుపెడుతున్న 6.5 ట్రిలియన్‌ డాలర్లలో దుబారా, అవినీతిని అరికడతాం. ఫెడరల్‌ సంస్థలను పునర్నిర్మించి ఈ ఇద్దరు (మస్క్, వివేక్‌) అద్భుతమైన అమెరికన్లు నా పాలనకు మార్గం సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా అంటూ ట్రంప్ తెలిపారు. 

Also Read :  నెట్టింట 'బేబమ్మ' క్యూట్ ఫోజులు.. ఒక్క చూపుకే కుర్రాళ్ళు ఫిదా!

దీంతో పాటూ ఇప్పుడు వివేక్ రామస్వామి గతంలో తన గ్రాడ్యుయేషన్ టైమ్‌లో చేసిన ప్రసంగం ఒకటి వైరల్ అవుతోంది. 2003లో 18 ఏళ్ల వయసులో సెయింట్ జేవియర్ హైస్కూల్‌‌ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వివేక్.. స్నాతకోత్సవంలో... గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమని మాట్లాడారు. నేను నా హైస్కూల్ కెరీర్ మొత్తం పరుగెడుతూనే ఉన్నాను.. కానీ ఇప్పుడు, ఎండ్ లైన్‌ దాటుతున్నప్పుడు కొంచెం ముందుగానే ఆగిపోయి, నా చుట్టూ ఉన్న స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలని నేను కోరుకుంటున్నా అని మాట్లడారు. దాంతో పాటూ తాను బ్యూరోక్రసీకి వ్యతిరేకిని అని కూడా చెప్పారు. దీని మీద వివేక్ స్పందించారు. తాను ఇప్పటికీ ఇదే భావజాలం అనుసరిస్తున్నా అని చెప్పారు. 

Also Read :  'మందు షాప్‌ దగ్గర ఉన్నది నేనే'.. కానీ, అల్లు అర్జున్‌ సంచలనం!

Also Read: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

#usa #donald-trump #vivek-ramaswamy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe