/rtv/media/media_files/2025/10/02/greta-2025-10-02-08-38-03.jpg)
Greta Thunberg
గాజాలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ సైన్యం అస్సలు ఒప్పుకోవడం లేదు. ఇటలీ, స్పెయిన్ నుంచి వచ్చిన దాదాపు 44 గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా ఓడలను ఇజ్రాయెల్ దళం అడ్డుకుంది. ఇందులో మూడు ఓడలను తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ 44 షిప్ లలో దాదాపు 500 దాకా కార్యకర్తలు ఉన్నారు. ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకున్న ఓడల్లో మానవతా వాది గ్రెటా థన్ బర్గ్ తో పాటూ 70 మంది కార్యకర్తలను ఐడీఎఫ్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గాజా తీరం నుంచి దాదాపు 77 నాటికల్ మైళ్ళు దూరంలో అడ్డగించారని చెబుతున్నారు.
అవును మా అదుపులోనే ఉన్నారు..
ఈ మొత్తం సంఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టింది. ఫ్లోటిల్లాలోని ఓడలను సురక్షితంగా నిలిపివేసి అందులో ప్రయాణికులను ఇజ్రాయెల్ ఓడ రేవులకు తరలించామని చెప్పారు. ఇందులో అల్మా అనే ప్రధాన నౌకలో స్వీడిష్ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్, ఆమె స్నేహితులు ఉన్నారని...వారు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నారని ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. థన్ బర్గ్ కు సంబంధించిన వీడియోను కూడా మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. ఇప్పటివరకు కనీసం ఆరు నౌకలను ఇజ్రాయెల్ నావికాదళం అడ్డగించిందని తెలిపింది. ఆ నౌకల పేర్లు డీర్ యాసిన్/మాలి, హుగా, స్పెక్టర్, అదారా, అల్మా మరియు సిరియస్ అని తెలిపారు.
Already several vessels of the Hamas-Sumud flotilla have been safely stopped and their passengers are being transferred to an Israeli port.
— Israel Foreign Ministry (@IsraelMFA) October 1, 2025
Greta and her friends are safe and healthy. pic.twitter.com/PA1ezier9s
గాజాను ఆకలితో జయించాలని..
ఈ నౌకలన్నీ గాజా సముద్రతీరంలో దురాక్రమణకు పాల్పడ్డాయని ఇజ్రాయెల్ చెబుతోంది. ఫ్లోరిడాకు నౌకను సముద్రంలో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దాంతో పాటూ ఫిరంగులతో దాడులు చేశారని చెప్పారు. అయితే ఓడల్లో ఉన్నవారు మరో రకంగా చెబుతున్నారు. తమ ఫ్లోటిల్లా ఏ చట్టాలనూ ఉల్లంఘించలేదని...ఇజ్రాయెల్ కావాలనే గాజాకు సాయం అందించనివ్వకుండా చేస్తోందని చెప్పారు. ఆకలిని ఇజ్రాయెల్ ఆయుధంగా ఉపయోగించాలని చూస్తోందని...అందుకే గాజాకు మానవతాసాయం అందించినవ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి అరెస్ట్ కు ముందు గ్రెటా థన్ బర్గ్ కూడా వీడియో పోస్ట్ చేసింది. తాను అల్మా నౌకలో ఉన్నానని...ఇజ్రాయెల్ తమను అడ్డుకుంటోదంని చెప్పింది.