ఈమధ్యకాలంలో బోయింగ్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన రేపుతోంది. తాజాగా మళ్లీ ఇదే కంపెనీకి చెందిన విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఏకంగా జనావాసాలపైనే కుప్పకూలడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే డీహెచ్‌ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం లిథువేనియాలోని విల్నియస్ విమానశ్రయం దగ్గర్లో ఉన్న జనావాసాలపై కూలింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన జరిగింది. లిప్‌కల్నిస్ అనే ప్రాంతంలోని ఇళ్లపై ఈ విమానం కూలింది.
Also Read: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం..
ఈ విషాద ఘటనలో స్పానిష్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. లిథువేనియా కాలమనం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 5.28 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక, సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఫ్లైట్ జర్మనీలోని లీప్‌జిగ్ నుంచి బయలుదేరింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
Also Read: హెజ్బుల్లా కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకారం!?
DHL Cargo Plane Crashes
ఈ విమానాన్ని డీహెచ్‌ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్‌లైన్స్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఎయిర్‌పోర్టులోని మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా ఆపేశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ బోయింగ్ విమానం కూలిన ఇళ్లల్లోని ప్రజలు సురక్షితంగానే ఉన్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. ఇదిలాఉండగా.. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన అజిముత్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి కిందకి దిగారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
Also Read: రూ.30 అరటిపండు రూ.52 కోట్లకు అమ్ముడుపోయింది.. ఎక్కడంటే?