Donald Trump: ట్రంప్‌కు షాకిస్తున్న డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్‌కు డెమోక్రాట్లు షాకిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ.. ఫెడరల్ జడ్జిల నియామకాలను చేపడుతోంది. సెనెట్ ఆమోదం పొందిన జడ్జిలను తొలగించే అధికారం ఎవరికీ లేకపోవడంతో.. ట్రంప్‌కు షాకిచ్చేలా డెమోక్రాట్లు పావులు కదుపుతున్నారు. By Bhavana 14 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి DonaldTrump: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న డొనాల్డ్ ట్రంప్.. బాధ్యతలు చేపట్టడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అప్పటివరకు జో బైడెన్ నేతృత్వంలో డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉండనుంది. Also Read: ఈ నేపథ్యంలో ట్రంప్ గెలుపుతో డెమోక్రటిక్ పార్టీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ట్రంప్ అధ్యక్ష పీఠంపైకి ఎక్కకముందే జడ్జిలను నియమించే ప్రక్రియను డెమోక్రట్లు మొదలు పెట్టేశారు. ఫెడరల్ న్యాయమూర్తులను డెమోక్రాట్లు నియమిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోని సెనెట్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. Also Read: తప్పుచేశా క్షమించండి.. పవన్, లోకేష్ కు శ్రీరెడ్డి సంచలన లేఖ! తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ అమెరికా డిస్ట్రిక్ కోర్టు జడ్జిగా పెర్రీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెనెట్ ఆమోదం కోసం మరో 31 మంది జడ్జిలు ఎదురుచూస్తున్నారు. ఇక జో బైడెన్ నామినేట్ చేసిన జడ్జిలకు సెనెట్ నుంచి ఆమోదం లభిస్తే.. అమెరికా రాజ్యాంగ ప్రకారం వారిని ఆ పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఇది సెనెట్‌కు అమెరికా రాజ్యాంగం కల్పించిన అధికారం. అయితే ఈ అధికారాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు డెమోక్రాట్లు తమ అధికార గడువు పూర్తయ్యేలోగా ఫెడరల్ న్యాయమూర్తుల నియామకాలను మొదలు పెట్టారు. Also Read: BIG BREAKING: మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్! గతంలో 2016 నుంచి 2020 వరకు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 234 జడ్జిల నియామకాలకు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత పదవిలోకి వచ్చిన జో బైడెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కేతంజీ బ్రౌన్ జాక్సన్‌ను నియమించారు. ఆయనతోపాటు మరో 213 మంది జ్యుడిషియల్ నామినీలను బైడెన్ నియమించినట్లు సెనెట్ తెలిపింది. ఇందులో మూడింట రెండో వంతు మహిళా న్యాయమూర్తులకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలోనే మిగిలిన నామినీల నియామకాలను కూడా వేగంగా పూర్తి చేసేందుకు డెమోక్రాట్లు చర్యలు చేపట్టినట్లు సమాచారం. Also Read: కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! ఇక జో బైడెన్ నామినీలను నియమించడాన్ని డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లు వ్యతిరేకించారు. ఈ జడ్జిల నియామక ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సెనెట్‌కు సూచించారు. తాము నియమించుకున్న న్యాయమూర్తులతో డెమోక్రట్లు ముందుకుసాగాలని చూస్తున్నారని ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక అమెరికా రాజ్యాంగం ప్రకారం.. సెనెట్ ఆమోదించిన జడ్జిలను తొలగించడం వీలు కాదు కానీ.. ట్రంప్ అధికారంలోకి వస్తే.. ఆ నిబంధనను మార్చేస్తారా అనే అనుమానాలు కూడా అనుమానం వ్యక్తం అవుతున్నాయి. Also Read: Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు.. మహిళలకు ఈ ఛాన్స్ మళ్లీ రాదు #national-news #democratic-party #joe-biden #donald-trump #US President మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి