తప్పుచేశా క్షమించండి.. పవన్, లోకేష్ కు శ్రీరెడ్డి సంచలన లేఖ! ఏపీలో సోషల్ మీడియాలో అసభ్య రాతలు వారిపై వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి శ్రీరెడ్డి పవన్, లోకేష్ కు బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను క్షమించి వదిలేయాలని, ఇంకెప్పుడూ తప్పు చేయానంటూ విజ్ఞప్తి చేశారు. By Bhavana 14 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Sri Reddy: ఏపీ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు లేనట్లుగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు మమ్మల్ని ఆపేవాడే లేడు అన్నట్లు రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా తనదైన తిట్లు, ప్రవర్తనతో చెలరేగిపోయిన శ్రీరెడ్డి...ఇప్పుడు క్షమించండి అన్నా అంటూ దండాలు పెడుతుంది. Also Read: AP Crime: తిరుపతిలో ఘోర ప్రమాదం...ఇద్దరు మహిళలు మృత్యువాత తాజాగా ఊహించని స్థాయిలో అటు వైసీపీ అధినేత జగన్ కు, ఇటు మంత్రి నారా లోకేష్ కు ఆమె స్వయంగా చేతిరాతతో లేఖ రాశారు! ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.అయితే... కూటమి ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టినవారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసినవారిపై పోలీసులు తమ జూలం చూపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి పైనా పలు కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఆమె కాగితం, కలం చేతపట్టారు. శ్రీరెడ్డి బహిరంగ లేఖ... pic.twitter.com/16ezI0uMjF — Manchodu Mani (@manchodumani) November 14, 2024 Also Read: మట్కా ట్విట్టర్ రివ్యూ.. వరుణ్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫెర్మార్మన్స్‌గా నిలుస్తుందా? లోకేష్ అన్నకు విజ్ఞప్తి! ఇందులో ముందుగా నారా లోకేష్ ను ఉద్దేశించి రాస్తూ... "ముందుగా లోకేష్ అన్నకు విజ్ఞప్తి!" అని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తాను పుట్టింది గోదావరి అయినా.. పెరిగింది మొత్తం విజయవాడ లో అని, తనకు లోకేష్ సామాజికవర్గానికి చెందినవారే 95% స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో తన తల్లిదండ్రులు టీడీపీకే ఓటు వేసినట్లు చెప్పింది. Also Read: TG:టీచర్ ఉద్యోగాల భర్తీలో గందరగోళం.. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్.. ! అంతేకాకుండా అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబసభ్యులను ఎంతో సంతోష పెట్టిందని.. తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని.. అందువల్ల తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారని అన్నారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని.. అయినా తనకు అంత స్థాయి లేదని చెబుతూ.. ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా... గత పదిరోజులుగా మీడియాలో వచ్చే కథనాలు, వాటి కింద కనిపించే కామెంట్లు, స్పీచ్ లు, డిస్కషన్లు, డిబేట్లు, కూటమిలో ఉన్న అందరూ చేస్తున్న అటాక్ తర్వాత తనకు ఓ విషయం అర్ధమైందని.. అదేమిటంటే... తాను ఇంతకాలం ఎంతమందిని బాధపెట్టానో అంటూ రాసుకొచ్చింది. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడింది తనకే తెలియడం లేదని.. అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోంమినిస్టర్ కు, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకు, సోషల్ మీడియాకి, 99, ప్రైం టీవీ, పవన్ కల్యాణ్, వీరమహిళలకు తన క్షమాపణలు అని రాసుకొచ్చింది. Also Read: Ponguleti : ఒక బాత్రూం, కిచెన్ తప్పనిసరి.. ఇందిరమ్మ ఇళ్ల రూల్స్ ఇవే! అయితే.. ఇప్పటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఈ లేఖ కాదని.. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే తన బుద్ది మారుతుందని అనుకోవద్దని.. అలా జరిగితే ప్రైవేటు వ్యక్తులతో తనను ఏమైనా చేసుకోవచ్చని.. ఇకపై తప్పుడు భాషను ఎవరిపైనా వాడనని.. తమ కుల దైవం మీద ప్రమాణం చేసి చెబుతున్నట్లు శ్రీరెడ్డి లేఖలో రాసుకొచ్చారు. ఇక.. ఇంట్లో పెళ్లి కావాల్సిన ముగ్గురు పిల్లలు ఉన్నారని.. దయచేసి తన కుటుంబాన్ని కాపాడాలని.. తన బాధ తనకంటే ఎక్కువగా ఇంతమందిని పరిపాలించే మీకే బాగా అర్ధమవుతుందని.. కేసుల నుంచి తనను విముక్తురాలిని చేయాలని కోరారు. ఇదే సమయంలో చిరంజీవి, నాగబాబు, సినిమా ఫ్రెండ్స్ కి సారీ చెబుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... సినిమాలోనూ, రాజకీయాల్లోనూ తాను ఫెయిల్ అయినట్లు, అందుకు తాను అంగీకరిస్తున్నట్లు చెబుతూ.. షర్మిల, సునీత లకు కూడా క్షమాపణలు చెబుతూ శ్రీరెడ్డి లేఖ రాసింది. ఆ అదృష్టం నాకు లేదు జగనన్న... ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు మరో లేఖ రాసింది. అందులో జగన్, భారతికి హృదయపూర్వక నమస్కారాలతో మొదలు పెట్టారు. ఈ జన్మకు మిమ్మల్ని నేరుగా కలిసే అదృష్టం కానీ, కలిసి ఫొటో దిగే అవకాశం లేదని ఆ అదృష్టానికి నేను నోచుకోలేదని రాసింది. వైసీపీకి తన పేరుతో చెడ్డపేరు తీసుకొచ్చినట్లు అని శ్రీరెడ్డి పేర్కొంది. తాను గతలో చేసిన పనికి.. నేడు మీడియాలో చాలా మంది పార్టీని దుమ్మెత్తి పోయడం తనను మానసికంగా కృంగదీసిందని.. పార్టీని పలువురి మాటల దాడిలో సేవ్ చేస్తున్నానని అనుకున్నానే తప్ప డ్యామేజ్ చేస్తున్నట్లు గ్రహించలేకపోయానని ఆమె చెప్పింది. తాను వైసీపీ సభ్యురాలిని కానప్పటికీ... సాక్షిలో పనిచేసినప్పటి నుంచీ జగన్, భారతిలపై గౌరవమర్యాదలు ఏర్పడ్డాయని.. ఒకప్పుడు పార్టీ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు తిరిగి కష్టకాలంలో పడిందని అన్నారు. తన పాపం మీకు అంటుకోకూడదని తాను చేసిన పనులు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టాయో అర్ధం చేసుకోగలలని చెప్పింది. ఈ సందర్భంగా తాను వైసీపీకి, వైసీపీ కార్యకర్తలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఇష్టం లేదని.. తనను క్షమించాలని కోరుతూ... ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. #Sri Reddy Apologizes #nara-lokesh #pawankalyan #sri-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి