/rtv/media/media_files/2025/12/20/deepu-2025-12-20-15-27-46.jpg)
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారత్‌కు వ్యతిరేకంగా గళం ఎత్తే తీవ్రవాద భావజాలం నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ(Usman Hadi) హత్య(murder) తో పూర్తిగా హింసాకాండంగా మారిపోయింది. బంగ్లాదేశ్ ఢాకాలో షరీఫ్ ఉస్మాన్ హదీపై ఓ దుండగుడు పూర్తిగా ముసుగు ధరించి పట్టపగలేకాల్పలు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం సింగపూర్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఉస్మాన్ హదీ హత్య చేసిన వ్యక్తి ఫైసల్ కరీం అని గుర్తించారు. హదీమరణవార్తతో బంగ్లాదేశ్ రగిలిపోతోంది. విద్యార్థులు, హదీమద్దుతుదారులు రెచ్చిపోయారు. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనా(Bangladesh Ex PM Sheikh Hasina) కు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టడమే కాకుండా, ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడ్డారు.
కొట్టి చంపేశారు..
ఇదిలా ఉంటే...బంగ్లాదేశ్ లో మరో గొడవ కూడా చెలరేగుతోంది. అదే ఆందోళనకారులు 25 ఏళ్ళ దీపూ చంద్రదాస్ ను చంపడం. ఇను హిందూ మతానికి చెందిన వ్యక్తి. ఆందోళన (Bangladesh protests)ల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో దీపూను తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యూనస్ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది. ఈ హత్య కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు తెలిపారు. తమ ప్రభుత్వ పాలనలో మూక దాడులకు చోటు లేదని, ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిషన్ అల్లర్లపై దర్యాప్తు చేస్తోందన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఉద్రిక్త పరిస్థితులకు కారణమిదే..
ఆందోళనకారులు మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలపై దాడులు చేశారు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ నివాసానికి కూడా నిప్పు పెట్టారు. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటం ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఎక్కువగా హిందువులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. మత విద్వేష ఆరోపణలతో ఒక హిందూ వ్యక్తిని అతి దారుణంగా కొట్టి, నిప్పు పెట్టి చంపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శాంతిని నెలకొల్పడంలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Follow Us