Biden: నస్రల్లా హత్య న్యాయమైన చర్య: బైడెన్‌!

హెజ్‌బొల్లా అధినేత షేక్‌ హసన్‌ నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యాయమైన చర్యగా సమర్థించారు. నస్రల్లా కారణంగాహెజ్‌బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్‌ తెలిపారు.

New Update
America-Hamas: అమెరికాకు హమాస్‌ వార్నింగ్‌...త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!

Joe Biden: బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత షేక్‌ హసన్‌ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నస్రల్లా హత్యను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ న్యాయమైన చర్యగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది మొదలైన యుద్ద ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్‌ ప్రారంభం అయ్యిందని బైడెన్‌ అన్నారు.

హెజ్‌బొల్లా, హమాస్‌ వంటి ఇరానియన్‌ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ కు అమెరికా మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ కు అమెరికా మద్దతును ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్‌బొల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతి చెందినట్లు బైడెన్‌ తెలిపారు. ప్రతిపక్షాల దూకుడును అరికట్టి, యుద్ధ ప్రమాదాన్ని తగ్గించడానికి మధ్య ప్రాచ్య ప్రాంతంలో యూఎస్‌ సైనిక దళాల రక్షణను మరింత మెరుగుపరచాలని రక్షణ కార్యదర్శిని ఆదేశించినట్లు బైడెన్‌ పేర్కొన్నారు.

మరో వైపు బీరూట్‌ లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబ సభ్యులు అమెరికన్‌ పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. బీరూట్‌ లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయం పై ఇజ్రాయెల్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో నస్రల్లా మృతి చెందినట్లు పలు మీడయా కథనాలు వెలువడ్డాయి. 

పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువు పై యుద్ధం కొనసాగిస్తామని హెజ్‌బొల్లా బృందం ప్రకటించింది.

హెజ్‌బుల్లా సంస్థను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్‌ హసన్‌ నస్రల్లాను టార్గెట్ చేసి లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం దాడులు చేసింది. దీంతో నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళాలు శనివారం ఎక్స్‌ వేదికగా అధికారికంగా వెల్లడించాయి. హసన్‌ నస్రల్లా ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేడంటూ రాసుకొచ్చింది. మరోవైపు నస్రల్లా కుమార్తె జైనబ్‌ కూడా మరణించారనే వార్తలు వస్తున్నాయి.

Also Read: అక్టోబర్ 2న 'రింగ్ ఆఫ్ ఫైర్' సూర్యగ్రహణం!

Advertisment
Advertisment
తాజా కథనాలు