USA: ఉక్రెయిన్ కన్నా రష్యాతో డీల్ చేయడం ఈజీ..ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో కంటే రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ అని అన్నారు. 

New Update
trump

putin, zelensky, Trump

బలంతో పోల్చి చూస్తే రష్యా కన్నా ఉక్రెయిన్ తక్కువగానే ఉంటుంది. వారి వద్ద పెద్ద బలం లేదు. కానీ ఉక్రెయిన్ తో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.  కానీ రష్యా అలా కాదని...ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తో నాకు మంచి సంబంధాలున్నాయి. అతని మీద నాకు విశ్వాసం ఉంది. పుతిన్ ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారని నమ్మకంగా చెప్పారు. ఇద్దరి మధ్యా యుద్ధంలో ఉక్రెయిన్ దే తప్పని అన్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. మాస్కో దళాలు ఎందుకు ఆదేశం మీద భీకర దాడులు చేస్తున్నాయో నాకు ఇప్పుడు అర్ధమవుతోందని అన్నారు. ఉక్రెయిన్ స్థానంలో ఎవరున్నా...పుతిన్ అదే చేస్తున్నారని ట్రంప్ మాట్లాడారు. 

ఉక్రెయిన్ తో చాలా కష్టంగా ఉంది..

 యుద్ధం ఆపడానికి, శాంతి చర్చలకు ఎంత ప్రయత్నిస్తున్నా అవడం లేదని బాధను వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భద్రతా హామీకి ఒత్తిడి చేస్తున్నారు. కానీ దీని వలన కాల్పుల విరమణ, శాంతి ఒప్పందాల్లో అమెరికా ప్రమేయాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  మరోవైపు ఉక్రెయిన్ మీద దాడులు ఆపకపోతే రష్యాకు కూడా భారీ సుంకాలు, ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు అమెరికా     అధ్యక్షుడు ట్రంప్. రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్‌ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాలు విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ, శాంతిపై ఒప్పందం చేసుకునే వరకు వీటిని కొనసాగిస్తామని అన్నారు. తాము చర్యలు తీసుకోక ముందే రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 

Also Read: Champions Trophy: ఫైనల్స్ లో స్పిన్నర్స్ దే పై చేయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు