/rtv/media/media_files/2026/02/08/dalai-lama-2026-02-08-13-10-45.jpg)
Dalai Lama
జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్(Epstein Files) వ్యవహారం ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ఎప్‌స్టీన్‌కు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన దలైలమా కార్యాలయం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. ఆయన ఎప్పుడూ కూడా ఎప్‌స్టీన్‌ను కలవలేదని స్పష్టం చేసింది. అంతేకాదు ఆయన తరఫున మరెవరు ఎప్‌స్టీన్‌తో సమావేశం అయ్యేందుకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది.
Dalai Lama Never Met Epstein
ఇదిలాఉండగా అమెరికాలో వెలుగు చూసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల పేర్లు బయటకు రావడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే దలైలమా పేరు కూడా తెరపైకి రావడం చర్చనీయాంశమయ్యింది. దీంతో తమ గౌరవానికి భంగం కలిగించేలా జరుగుతున్న ఈ ప్రచారాన్ని దలైలామా కార్యాలయం ఖండించింది.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ... 51 మంది లొంగుబాటు
జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి సుమారు 30 లక్షల ఫైళ్లను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. వీటిలో ఏకంగా 2 వేలకు పైగా వీడియోలు, లక్షా ఎనభై వేల ఫొటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ లాంటి పేర్లు బయటికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Follow Us