Amazon:అమెజాన్‌ వ్యవస్థాపకుడు బెజోస్‌ నౌకలో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన 500 మిలియన్‌ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్‌ శాంచెజ్‌ షిప్‌లోనే ఉన్నట్లు సమాచారం.

New Update
bejos

bejos

ప్రముఖ వ్యాపారవేత్త, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన 500 మిలియన్‌ డాలర్ల విలాసవంతమైన నౌకలో కస్టమ్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో బెజోస్‌కు కాబోయే భార్య లారెన్‌ శాంచెజ్‌  షిప్‌లోనే ఉన్నట్లు సమాచారం. సోదాలు జరుగుతున్నప్పుడు ఆమె ఎంతో రిలాక్స్‌డ్‌గా సన్‌ బాతింగ్‌ను ఎంజాయ్‌ చేసినట్లు అంతర్జాతీయ మీడియా ఒకటి వివరించింది. దాదాపు మూడు గంటల పాటు సోదాలు జరిగినట్లు తెలుస్తుంది.

Also Read: Syria:సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం

న్యూఇయర్‌ వేడుకల  కోసం సెలబ్రిటీలందరూ సేదతీరే సెయింట్‌ బార్ట్స్‌ వద్ద షిప్‌ ఉండగా.. అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా, లారెన్‌ శాంచెజ్, జెఫ్‌ బెజోస్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిద్దరూ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్‌ బెజోస్‌ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్‌ తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 

Also Read: USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్

బెజోస్-లారెన్‌ తమ ప్రేమ వ్యవహారాన్ని..

అనంతరం బెజోస్-లారెన్‌ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో గతేడాది వీరు ఎంగేజ్మెంట్‌ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్‌ సందర్భంగా బెజోన్‌ తనకు కాబోయే భార్యకు 2.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే రింగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు ప్రియురాలి కోసం ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి.

అమెరికా ఫ్లోరిడా లోని ‘ఇండియన్‌ క్రీక్‌’ ఐలాండ్‌లో 68 మిలియన్‌ డాలర్ల  త్రీ బెడ్‌ రూమ్‌ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also Read: Hit And Run: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్‌ కలకలం.. ఓ యువకుడు మృతి

Also Read: USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు