Green Cards: 10 లక్షల మంది భారతీయులకు షాకిచ్చేందుకు రెడీ అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ గ్రీన్ కార్డులపైనే కన్నేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ తీసుకోనున్న ఒక్క నిర్ణయంతో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనుంది.

usa
New Update

Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ముందు నుంచి కూడా అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. అమెరికన్లకే చెందాలనేది ట్రంప్ ముందు నుంచి వాదిస్తున్న వాదన. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Also Read:  IPL: ఐపీఎల్ వేలంలోకి 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్.. రూ.1.25 కోట్ల డిమాండ్!

10 లక్షల మంది భారతీయులపై...

ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చే ఆలోచనలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు అమెరికా నిబంధనల ప్రకారం.. చట్టబద్ధంగా ఆ దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడిన వలసదారులు గ్రీన్ కార్డు పొందినట్లైతే.. వారికి పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ విధానానికే డొనాల్డ్ ట్రంప్ స్వస్తి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. 

Also Read:  Ponguleti: అప్పుడే ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది.. పొంగులేటి మరో సంచలనం!

 అమెరికాలో కొత్తగా తీసుకురానున్న గ్రీన్ కార్డ్ రూల్స్ ముసాయిదా ప్రతిపాదన ప్రకారం.. అమెరికాలోని చట్టబద్ధమైన వలసదారులకు పుట్టబోయే పిల్లలు.. పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధంగా శాశ్వత నివాసి అయి ఉండాల్సిందేనని సమాచారం. 

Also Read: TG: ఎల్లుండి నుంచి అసలు సర్వే.. ఏ ఇళ్లు వదలొద్దు: సీఎస్ కీలక ఆదేశాలు

అయితే ఈ ప్రతిపాదన చట్టపరంగా పెను సవాళ్లను ఎదుర్కొవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన పిల్లలందరికీ ఇస్తున్న పౌరసత్వ హామీకి వ్యతిరేకంగా ఉందని చెబుతున్నారు. అయితే గ్రీన్ కార్డ్ రూల్స్‌లో తీసుకురానున్న ఈ మార్పు కారణంగా 10 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్నందున.. ఈ ప్రణాళిక ప్రవాస భారతీయులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

Also Read:  Maharashtra : నేను గెలిస్తే బ్రహ్మచారులందరికీ పెళ్లి చేస్తా..!

 గత కొన్నేళ్లుగా అమెరికాలో టెక్ ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న భారతీయ కుటుంబాలు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ ప్రతిపాదన కోర్టులో చెల్లుబాటు కాదని అంటున్నారు. హెచ్-1బి వీసాల్లో ఉన్న చట్టబద్ధమైన వలసదారుల పిల్లలు ఇప్పటికీ పుట్టుకతో అమెరికా పౌరసత్వానికి అర్హులని ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా వెల్లడించారు.

ప్రస్తుతం అమెరికాలో 48 లక్షల మంది భారత అమెరికన్లు ఉన్నారు. వారిలో 34 శాతం మంది అంటే 16 లక్షల మంది అమెరికాలోనే పుట్టారు. అందువల్ల వారికి పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది.  డొనాల్డ్ ట్రంప్.. ఎలాగైనా తన నిర్ణయాన్ని అమలు చేయాలని భావించి.. ఇదే నిబంధనలను ఆచరణలోకి తీసుకువస్తే అది ప్రవాస భారతీయులకు పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది.  ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌ల వార్షిక పరిమితి 1.4 లక్షలుగా నిర్ణయించారు.

#america #donald-trump #green-card
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe