/rtv/media/media_files/2026/03/06/jiang-xueqin-2026-03-06-10-50-31.jpg)
భౌగోళిక రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టడంలో ఎక్స్‌పర్ట్ అయిన చైనా విద్యావేత్త అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మే 2024లో జియాంగ్ జుయెక్విన్ ఇచ్చిన స్పీచ్(Jiang Xueqin predection) ప్రస్తుతం వైరల్ అవుతోంది. డొనాల్డ్ ట్రంప్ విజయం నుంచి ఇరాన్ యుద్ధం(us iran war) వరకు ఆయన చెప్పిన విషయాలు అక్షరాలా నిజమవుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
Last year, Prof. Jiang broke down exactly how and why Israel would get the US to start a ground war in Iran…and why it’s good for Israel if we lose.
— Jordan Crowder (@digijordan) March 4, 2026
This is fuct. pic.twitter.com/xu3oFKIYav
Also Read : ఇజ్రాయిల్‌పై ఇరాన్ డేంజరస్ క్లస్టర్ బాంబ్.. బయటపడ్డ చైనా, రష్యా సీక్రెట్ ఆపరేషన్!
జియాంగ్ అంచనాలు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించి వైట్ హౌస్‌కు తిరిగి వస్తారని జియాంగ్ ముందే చెప్పారు.
ఇరాన్‌తో సైనిక సంఘర్షణ: ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికా, ఇరాన్ మధ్య అనివార్యంగా యుద్ధం సంభవిస్తుందని ఆయన హెచ్చరించారు.
అమెరికాకు వినాశనం: ఇరాన్‌తో జరిగే ఈ యుద్ధం అమెరికాకు అత్యంత ఘోరమైన, వినాశకరమైన ఫలితాలను మిగులుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
Professor Jiang predicts Iran will attempt to create “Pax Islamica” to win the war against US/Israel forces
— AutisticClips (@AutisticClip) March 4, 2026
“The Iranian game plan is to create a religious crusade that unifies the Shia Muslims to overthrow the American empire and establish Pax Islamica.” pic.twitter.com/GiWFzBoClF
యుద్ధంపై విశ్లేషణ
జియాంగ్ అభిప్రాయం ప్రకారం, ఇరాన్‌పై అమెరికా చేసే దాడి పురాతన గ్రీస్‌లో ఏథెన్స్ చేపట్టిన ఫైల్యూర్ ఆర్మీ ఆపరేషన్ వంటిదని పోల్చారు. ఇరాన్ గత రెండు దశాబ్దాలుగా ఇటువంటి సంఘర్షణను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయని ఆయన వాదించారు. ఈ యుద్ధం త్వరగా ముగియదని, ఇది ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తుందని ఆయన హెచ్చరించారు.
Also Read : ఇండియా నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై దాడి.. 80 మంది మృతి
ఎవరు ఈ జియాంగ్ జుయెకిన్?
జియాంగ్ జుయెకిన్ బీజింగ్‌లో తత్వశాస్త్రం, హిస్టరీ లెక్చరర్. ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రుడైన ఆయన, చైనాలో విద్యా సంస్కరణలపై ఎంతో కృషి చేశారు. ఆయన కేవలం లెక్చరర్ మాత్రమే కాదు, 'ప్రిడిక్టివ్ హిస్టరీ' అనే యూట్యూబ్ ఛానెల్‌తో చారిత్రక చక్రాలు, భౌగోళిక రాజకీయాలు, గేమ్ థియరీని విశ్లేషిస్తూ ప్రపంచ పరిణామాలను ముందే అంచనా వేస్తుంటారు. ప్రస్తుతం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో ఆయన మాటలు నిజమవుతాయేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది.
Follow Us