/rtv/media/media_files/2025/03/11/xJdGlqiDOX9PxrkKqDlJ.jpg)
water fasting Photograph: (water fasting)
బరువు తగ్గడానికి ఆన్‌లైన్‌లో చిక్కాలను పాటించి ఓ యువతి చనిపోయింది. వేగంగా బరువు తగ్గాలని చాలామంది ఏవేవో చేసి ప్రాణాల మీదకు తెచ్చకుంటారు. అలాంటి ఘటనే కేరళలోని తలస్సేరీలో చేటు చేసుకుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ఆమె వాటర్ డైట్ చేసింది. యువతి దాదాపు 6 నెలలుగా ఆహారం తీసుకోకుండా కేవలం వాటర్ మాత్రమే తాగింది. లోకాలరీస్ ఫుడ్ కారణంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిని హాస్పిటల్‌పాలైంది. యువతి 24 కేజీల బాడీ వెయిట్‌తో హస్పిటల్లో జాయిన్ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఆమె షుగర్ లెవల్స్, సోడియం, రక్తపోటు చాలా తక్కువగా ఉన్నాయి.
Also read: SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌లో మద్రాస్ IIT రోబోలు
🚨Breaking
— Backchod Indian (@IndianBackchod) March 10, 2025
A young life lost due to blind trust in online diet plans. The 18-year-old from Koothuparamba had been severely restricting food intake after following a #YouTube-based weight loss routine. #Kerala pic.twitter.com/rmE1xAYXaO
వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ ఇచ్చినా ఆమె కోలుకోలేదని డాక్టర్లు చెప్పారు. 12 రోజులు యువతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. క్లినికల్ కన్సల్టేషన్ లేకుండా ఇటువంటి డైట్ పాటించొద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే హెల్త్ టిప్స్ నమ్మోద్దని డాక్టర్లు చెబుతున్నారు.
అన్ని రోజులు ఆహారం తినకుండా ఉన్నందుకు ఆ యువతికి అనోరెక్సియా నెర్వోసా సమస్యలు వచ్చాయి. ఆమె కేవలం హాట్ వాటర్ మాత్రమే తాగుతున్నట్లు యువతి ఫ్యామిలీకి తెలియకుండా ఉంచింది. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి క్రాష్ డైట్, వాటర్ డైట్ ప్రజాదరణ పొందినప్పటికీ ఇవి చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అనోరెక్సిక్ అంటే..
ఇది ఒక రకమైన తినే ఆరోగ్య సమస్య. ఈ సమస్య ఉన్న వారు ఆహారం తినడానికి జంకుతారు. తక్కువ శరీర బరువు, బరువు పెరుగుతారనే భయంతో తినకుండా ఉంటారు. వాటర్ డైట్ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చేయాలని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ కాలం వైద్య పర్యవేక్షణ లేకుండా చేయకూడదు. ఎక్కువ కాలం చేస్తే అది ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 72 గంటలకు మించి నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు సంభవించవచ్చు. లో కెలరీస్ డైట్ తీసుకుంటూ వారానికి 500 గ్రాములు తగ్గడం హెల్తీ వెయిట్ లాస్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేగంగా బరువు తగ్గింతే ఇంతా ప్రమాదమా..
గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ దీప్తి ఖతుజా ప్రకారం.. క్రాష్ డైట్ త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ దాని వల్ల పర్మినెంట్ వెయిట్ లాస్ అవ్వదని చెప్పారు. అంతేకాదు దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు దారితీయవచ్చు. క్రాష్ డైటింగ్ వల్ల అనారోగ్యకరమైన బరువు తగ్గడం, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం మరియు తినే రుగ్మతలు కూడా వస్తాయి. ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఆందోళన, నిరాశ మరియు చిన్న వయసులోనే వృద్ధాప్యం వంటి పరిస్థితులకు దారితీస్తుంది.
Also read: Mom sit on son: ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా