BIG BREAKING: ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు..చౌకగా నిత్యావసర వస్తువులు

ఢిల్లీలో ఈరోజు జరిగిన జీఎస్టీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ నెల 22 నుంచి రెండు జీఎస్టీ శ్లాబులను మాత్రమే అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం 5, 18 మాత్రమే జీఎస్టీ పడనుంది. 

New Update
GST

NEW GST RATES

ముందే చెప్పినట్టుగానే జీఎస్టీ రేట్లు , శ్లాబులను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ రోజు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 22 నుంచి ఇప్పటి వరకు వస్తున్న నాలుగు శ్లాబులను కాకుండా కేవలం రెండే జీఎస్టీ శ్లాబ్స్ ను అమలు చేయాలని డిసైడ్ అయింది. అన్ని వస్తువుల మీదా 5 శాతం, 18 శాతం మాత్రం ఇక మీదట జీఎస్టీ పడుతుందని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న 12, 28 శాతాలను తొలగించింది. అయితే విలాస వస్తువులపై మాత్రం జీఎస్టీ ను 40 వాతం విధించనున్నారు.   ఈ కొత్త నిర్ణయం కారణంగా దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో బ్రీఫింగ్ ఇవ్వనున్నారని సమాచారం.

భారీగా తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు..

ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమలులోకి వచ్చాక 12 శాతం శ్లాబ్ వస్తువులు 5 శాతం శ్లాబులోకి చేరతాయి. అలాగే ఇప్పటి వరకు 90 శాతం వరకు 28 శ్లాబులో ఉన్న వస్తువులు.. 18 శాతానికి దిగి రానున్నాయి. దీంతో రూ. 2500 వరకు ధర ఉన్న షూస్, దుస్తులు లాంటి వాటికి ఇక మీదట కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ పడనుంది.  మరోవైపు సిగరెట్స్, కూల్ డ్రింక్స్, మత్తు పదార్థాల లాంటి వాటి మీద మాత్రం 40 శాతం పన్ను విధించనున్నారు. వాటిని ఎప్పటిలానే కంటిన్యూ చేస్తామని..వాటి వాడుకను అరికట్టాలంటే ఇది తప్పదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాటూ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైనా జీఎస్టీని మినహాయించనున్నారు. పన్ను రేట్లను తగ్గిస్తే.. ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని...వస్తువుల వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.  

Advertisment
తాజా కథనాలు