China: శాటిలైట్ ద్వారా ప్రపంచంలో తొలి సర్జరీ..చైనా అద్భుతం

ఉపగ్రహం ఆధారంగా అల్ట్రా–రిమోట్ సర్జరీలను చేసి చరిత్ర సృష్టించింది చైనా. ప్రపంచంలోనే ఇలా ఆపరేషన్ చేసిన మొదటి దేశంగా నిలిచింది.  భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న Apstar-6D బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి దీన్ని చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
surgery

china Satellite surgery

టెక్నాలజీలో ప్రపంచంలో అందరి కంటే ముందుంటుంది చైనా. ఎప్పటికప్పుడు తమ టెక్నాలజీని మెరుగు పర్చుకుంటూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తాజాగా ఉపగ్రహ ఆధారిత , అల్ట్రా–రిమోట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించిన మొట్టమొదటి దేశంగా చైనా రికార్డ్ సృష్టించింది. భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న Apstar-6D బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించి ఈ కార్యకలాపాలను నిర్వహించారు చైనా డాక్టర్లు. 

మూడు దేశాల నుంచి చైనాలో రోగులకు..

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు టిబెట్‌లోని లాసా, యునాన్‌లోని డాలీ, హైనాన్‌లోని సన్యా నుండి రిమోట్‌గా ఐదు ఆపరేషన్లను చేశారు. ఇవి అన్నీ విజయవంతం అయ్యాయి. బీజింగ్‌లో ఉన్న రోగులకు దేశీయంగా అభివృద్ధి చేసిన రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంతో వారి కాలేయం, పిత్తాశయం సర్జరీలు చేశారు. రోగులు అందరూ ఆపరేషన్ తర్వాత కోలుకున్నారని, ఆపరేషన్ మర్నాడే డిశ్చార్జ్ కూడా అయ్యారని  అక్కడి స్టేట్ బ్రాడ్ కాస్టర్ తెలిపింది. ఈ ఉపగ్రహ ఆధారిత ఆపరేషన్ల ద్వారా సుదూరాలను అవలీలగా జయించొచ్చని అంటున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ప్రభావవంతంగా ఆపరేషన్లను చేయవచ్చని చెబుతున్నారు. 

ఆప్‌స్టార్–6డి...

ఇదొక ఉపగ్రహం. దీన్ని చైనా 2020లో ప్రయోగించింది. ఇప్పుడు ఆపరేషన్లను విజయవంతం చేయడంలో ఈ ఉపగ్రహమే కీలక పాత్ర పోషించింది. సకనుకు 50 గిగాబిట్‌లను అందిచగల సామర్ధ్యం ఇది కలిగి ఉంది. ఆ ఆప్‌స్టార్ –6డి పదిహేళ్ళపాటూ విజయవంతంగా పని చేయగలదు. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా, ముఖ్యంగా వాయుఇంకా సముద్ర మార్గాల కోసం విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. విమానం, షిప్ లలో మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి రూపొందించబడిన మూడు నుండి నాలుగు భూస్థిర ఉపగ్రహాల ప్రణాళికలో Apstar-6D మొదటిది.

Also Read :  ఇన్‌స్టా ప్రేమ.. దాడిలో కార్లు ధ్వంసం

లాసా నుంచి డాక్టర్ లియు బీజింగ్‌లో ఉన్న రోగికి కాలేయ కణితి తొలిగించే ఆపరేషన్ ను ఆప్‌స్టార్ ఉపగ్రహం సాయంతోనే చేశారు. ఇది సర్జీరీలో ముఖ్యమైన డేటాను నాణ్యతతో ఎటువంటి ఆంకాలు లేకుండా అందించడంలో తోడ్పడింది. దాంతో పాటూ ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఆప్టిమైజేషన్ శస్త్రచికిత్సను విజయవంతం చేయడంలో అద్భుతంగా పని చేసింది. భవిష్యత్తులో ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ఉపగ్రహ ఆధారిత సర్జీరీలు అత్యంత సాధారణంగా నిర్వహించొచ్చని చైనా డాక్టర్లు చెబుతున్నారు. 24 గంటలూ, 365 రోజులూ మూరుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను దీని ద్వారా అందించగలుగుతామని తెలిపారు. 

ఆప్‌స్టార్ 6డి తరువాత దేశం యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ అయిన ఆప్‌స్టార్-6Eని ఇండోనేషియాకు అందించడం ద్వారా చైనా తన శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసింది.

Also Read: USA: అమెరికా హౌస్ స్పీకర్‌గా  మళ్ళీ మైక్‌ జాన్సన్‌ ఎన్నిక
 
 

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు