US-China Trade War: అమెరికాపై చైనా కన్నెర్ర..ద్వంద్వ ప్రమాణాలు అంటూ ఆగ్రహం

అరుదైన ఖనిజాల విషయంలో అమెరికా, చైనాల మధ్య వివాదం...వాణిజ్య యుద్ధంగా మారింది. చైనాపై కోపంతో ట్రంప్ ఆ దేశానికి 100 శాతం అదనపు సుంకాలను విధించారు. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని దుయ్యబట్టింది. 

New Update
us-china

అమెరికాపై చైనా కోపంతో రగిలిపోతోంది. తమపై వంద శాతం అదనపు సుంకాలను విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్ నిర్ణయాలు తమ దేశాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంది. చైనా దేశ ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. మామూలుగా తాము ఎవరితోనే గొడవలు పడము అని..కానీ ఇలాంటివి చేస్తే ఎంతకైనా తెగిస్తామని..చివర వరకు పోరాడతామని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ట్రంప్‌ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇరుదేశాల ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తాయని చెప్పింది. 

మొత్తం 130 శాతం సుంకాలు..

అమెరికా(america) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో టారీఫ్ బాంబ్ పేల్చారు.  చైనా దిగుమతులపై 100% సుంకాలు విధించారు. నవంబర్ 1 నుంచి పెంచిన టారీఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే డ్రాగన్‌పై 30 % సుంకాలు విధించారు ట్రంప్.. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై ఉన్న సుంకాలకు ఇది అదనం కావడం గమనార్హం. అంటే, చైనా వస్తువులపై మొత్తం టారిఫ్ సుమారు 130 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. చైనా ఇటీవల అరుదైన భూ మూలకాలఎగుమతులపై ఆంక్షలను కఠినతరం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థల్లో కీలకమైన ఈ ఖనిజాలపై చైనా ప్రపంచంలోనే ఆధిపత్యం చెలాయిస్తోంది. చైనా చర్యను ట్రంప్ తీవ్రంగా ఖండించారు.

Also Read: PAK-AFGHAN WAR: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు