USA: మెక్సికో, కెనడా రెండూ అమెరికాలో విలీనవ్వడమే మంచిది– ట్రంప్

కెనడా, మెక్సికోలు అమెరికాలో విలీనం కావడమే మంచిదంటూ మళ్ళీ వ్యాఖ్యలు చేశారు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటికి భారీ ఎత్తున రాయితీలు ఇవ్వడం కంటే ఆ పనే బెటర్ అని అన్నారు. 

New Update
USA: తాను గెలిస్తే...వాళ్ళని దేశం నుంచి వెళ్ళగొడతా-ట్రంప్

పొరుగు దేశాలకు ఇస్తున్న రాయితీలపై మరోసారి స్పందించారు అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్. కెనడా, మెక్సికోలకు భారీ ఎత్తున రాయితీలను ఇవ్వడం కంటే ఆ రెండింటినీ అమెరికాలో రెండు రాష్ట్రాలుగా చేయడమే బెటర్ అని ఆయన అన్నారు. కెనడాకు ఏటా 100 బిలియన్‌ డాలర్లకు పైగా రాయితీలు కల్పిస్తున్నాం. మెక్సికో కు అయితే.. 300 బిలియన్‌ డాలర్లు సబ్సిడీ ఇస్తున్నాం. అసలు అమెరికా ఎందుకు ఆ దేశాలకు రాయితీలు ఇవ్వాలి? దానికంటే ఆ రెండు దేశాలు అమెరికాలో విలీనమైతేనే మంచిది కదా అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Also Read: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్‌!

Also Read: భారతీయులకు అలర్ట్‌...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్!

ఊరుకునేదే లేదు..

కెనడా, మెక్సికోల మీద ట్రంప్ ఎప్పటినుంచో వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ దేశాల దిగుమతుల మీద భారీ సుంకాలను విధిస్తానని కాబోయే అధ్యక్షుడు ఇది వరకే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వచ్చిన కెనడా ప్రధాని ట్రుడోను ట్రంప్ కలిశారు.  ఈ సందర్భంగా రాయితీలు, సబ్సీడీల విషయం ఇరు నేతలూ చర్చించారని తెలుస్తోంది. ఇందులో వలసలు, డ్రగ్స్‌ను అదుపు చేయకపోతే...బావుండదని ట్రంప్ చెప్పినట్టు సమాచారం.  మరోవైపు అధికారం చేపట్టిన వెంటనే పుట్టుకతో సంక్రమించే పౌరసత్వ అంశంపై దృష్టిసారిస్తానని అంటున్నారు ట్రంప్. జాతీయ అత్యయిక పరిస్థితి తరహాలో వచ్చే నాలుగేళ్లలో అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపేస్తానని చెప్పారు. డ్రీమర్‌ ఇమిగ్రెంట్స్‌ విషయంలో ఓ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొనే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు.

Also Read: Supreme Court: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు

Also Read: ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా ఉంది రెండాకుల గుర్తే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు