కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంపై దాడి చేసిన ఘటనలో ఇది వరకే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హింసాత్మక ఘర్షణకు సంబంధించి పీల్ రీజియన్ పోలీసులు మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ నెల 3వ తేదీన బ్రాంప్టన్‌లోని గోర్ రోడ్‌లోని దేవాలయం వద్ద జరిగిన ప్రదర్శనలో ఇంద్రజిత్ గోసల్ (35) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
జెండా పట్టుకున్న ఫొటో నెట్టింట వైరల్..
ఇతను కెనడాలోని సిక్కులు ఫర్ జస్టిస్ అనే దానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే దాడి చేసిన నేపథ్యంలో ఇతన్ని అరెస్టు చేయగా.. కొన్ని షరతులతో పోలీసులు విడుదల చేశారు. ఆ తర్వాత ఇతన్ని బ్రాంప్టన్‌లోని అంటారియో కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో హాజరవుతాడు. అయితే ప్రస్తుతం అతను ఓ కార్యక్రమలో ఖలిస్తానీ జెండా పట్టుకుని, నిల్చోని ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
ఇదిలా ఉండగా ఒంటారియోలోని గ్రేటర్ టొరంటో ఏరియాలోని బ్రాంప్టన్‌లో నవంబర్ 3న ఆలయ అధికారులు, భారత కాన్సులేట్ సంయుక్తంగా ఓ కార్యక్రమం నిర్వహించింది.
ఇది కూడా చూడండి: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై..
ఇందులో ఖలిస్తానీ జెండాలు మోస్తూ నిరసనకారులు హిందూ సభ ఆలయం వద్ద భక్తులతో ఘర్షణ పడ్డారు.ఈ క్రమంలో ఇందర్‌జీత్ గోసల్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతనిపై అభియోగాలు మోపారని షరతులతో విడుదల చేశారు.
ఇది కూడా చూడండి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు