/rtv/media/media_files/2026/02/18/trump-vs-khameni-2026-02-18-19-17-09.jpg)
Trump vs Khameni
మిడియ్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికాకు సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా పంపిస్తున్న యుద్ధ నౌకలు ఎంత ప్రమాదకరమో.. వాటిని సముద్ర గర్భంలోకి పంపే ఆయుధాలు తమ వద్ద అంతకన్నా ప్రమాదకరంగా ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై ఒత్తిడి పెంచెందుకు ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యాధునిక యుద్ధ నౌక USS జెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌ను మధ్యప్రాచ్యానికి పంపారు.
దీనికి స్పందించిన ఖమేనీ ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి కూడా దెబ్బతినొచ్చని వ్యాఖ్యానించారు. మా తీరానికి వస్తున్న యుద్ధ నౌకలను సముద్రపు అడుగు భాగానికి పంపిచగమని అన్నారు. అయితే ఇరాన్ వద్ద నిజంగానే అమెరికా యుద్ధనౌకలను ముంచే ఆయుధాలు ఉన్నాయా అనేది చర్చనీయమవుతోంది. వాస్తవానికి USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ దాదాపు లక్ష టన్నుల బరువు ఉంటుంది. క్షిపణి దెబ్బకు దీన్ని ముంచడం అసాధ్యం. అంతేకాదు 2021లో నిర్వహించిన పరీక్షల్లో ఈ నౌక సమీపంలో భారీ పేలుళ్లు జరిపినా దీనికి ఏం కాలేదు.
Also Read: బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం.. అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ ?
ఈ నౌక చుట్టూ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, సబ్మెరైన్లు కూడా వెంటఉంటాయి. ఇవి దానికి రక్షణ కవచంలా ఉంటాయి. అయితే ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా.. వందలాది డ్రోన్లు, క్షిపణులను ఒకేసారి ప్రయోగించి అమెరికా డిఫెన్స్ సిస్టమ్‌ను గందరగోళానికి గురిచేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఉన్న హైపర్సోనిక్ క్షిపణులు సైతం అగ్రరాజ్యానికి సవాలుగా ఉండొచ్చు.
మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంతో అణు చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలను నిలిపివేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే అరేబియా సముద్రంలో USS అబ్రహం లింకన్ ఉంది. అయితే USS జెరాల్డ్ ఆర్. ఫోర్డ్ కూడా ఇప్పుడు ఇరాన్ వైపు వెళ్లడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
Also Read: శ్రీలంకలో ఎంపీల పెన్షన్లు రద్దు.. మరీ భారత్‌లో పరిస్థితి ఏంటి ?
Follow Us