బ్రిటన్ రాజు చార్లెస్ తన సతీమణి క్వీన్ కెమిల్లాతో కలిసి బెంగళూరులో రహస్య పర్యటనలో ఉన్నారు. బ్రిటన్ రాజు పర్యటన అంటే ప్రొటోకాల్, భారీ బందోబస్తు లేకుండా ఉండదు. కానీ ఈ చార్లెస్ దంపతులు బెంగళూరులోని ఓ మెడిటేషన్ సెంటర్‌లో రహస్యంగా పర్యటిస్తున్నట్లు సమాచారం. తల్లి క్విన్ ఎలిజబెత్ మరణం తర్వాత బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత కింగ్ చార్లెస్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!
ఓ మెడిటేషన్ సెంటర్‌లో రహస్య పర్యటన..
బెంగళూరులోని ఓ మెడిటేషన్ సెంటర్‌లో బ్రిటన్ రాజు ఆయుర్వేదం చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక్కడ ధ్యానంతో పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. గత నాలుగు రోజుల నుంచి ఈ సెంటర్‌లోనే పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న ఈ పర్యటన ముగించుకుని తిరిగి బ్రిటన్ వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?
ఈ పర్యటనలో భాగంగా సతీమణితో కలిసి ఆరోగ్య చికిత్సలు చేయించుకున్నారు. ఆ తర్వాత యోగా సెంటర్‌లో నడవడం, సేంద్రీయ వ్యవసాయానికి వెళ్లి అక్కడ సమయం గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ సెంటర్‌లో ధ్యానం చేశారు. అలాగే ఆహారం కూడా ప్రత్యేకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మెడిటేషన్ సెంటర్ మొత్తం 30 ఎకరాల్లో ఉంటుంది.
ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి
ఇదిలా ఉండగా కింగ్ చార్లెస్‌కు ఇలా పర్యటనలు చేయడం మొదటిసారేం కాదు. గతంలో ఒకసారి 2019లో బ్రిటన్ రాజు తన 71 పుట్టిన రోజు వేడుకలను ఇక్కడే జరుపుకున్నారట. అయితే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఈ ఆయుర్వేదం డాక్టర్ ఇస్సాక్ మథాయ్ కూడా వెళ్లినట్లు సమాచారం. గత కొన్నేళ్ల నుంచి కింగ్ చార్లెస్ ఆయుర్వేద వైద్యం తీసుకొంటున్నారట.
ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!