గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అతి భారీ జరిమానా ప్రకటించింది. తమ దేశ యూట్యూబ్‌ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్‌ రష్యన్‌ రూబుళ్ల భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువ.

New Update
Google Chrome: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో రాబోతున్న అద్భుతమైన ఫీచర్లు..

టెక్ దిగ్గజం అయిన గూగుల్ కంపెనీకి రష్యాలోని మాస్కో కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. తమ దేశ యూట్యూబ్‌ ఛానల్స్‌పై వేటు వేసినందుకు గూగుల్‌కు 2 అన్‌డెసిలియన్‌ రష్యన్‌ రూబుళ్ల భారీ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువ. ఒక అన్‌డెసిలియన్‌ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి.

ఇది కూడా చూడండి: నస్రల్లా మార్గమే నాది కూడా..హెజ్బుల్లా కొత్త ఛీఫ్ మొదటి ప్రసంగం

మొత్తం 17 ఛానల్స్‌ను నిలిపివేసినందుకు..

2.5 అన్‌డెసలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో మీరే అర్థం చేసుకోండి. 2020 నుంచి ఇప్పటివరకు క్రెమ్లిన్‌ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియాతో పాటు మొత్తం 17 ఛానల్స్‌ను యూట్యూబ్‌ నిలిపివేసింది. ఈ ఛానల్స్‌ను పునరుద్ధరించాలని మాస్కో కోర్టు గూగుల్‌‌ని ఆదేశించింది. అయిన కూడా గూగుల్ ఒప్పుకోకుండా దీనికి నిరాకరించింది. దీంతో గూగుల్‌కు మాస్కో కోర్టు అతి భారీ జరిమానా విధించింది.

ఇది కూడా చూడండి: అయోధ్యలో దీపోత్సవం.. రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు 

ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్‌ డాలర్ల కంటే కూడా ఇది అధికం. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఫైన్‌ కట్టడం గూగుల్‌కు  కూడా దాదాపు సాధ్యం కాకపోవచ్చు. రష్యన్‌ కోర్టులు ఇచ్చే తీర్పుల వల్ల గూగుల్ ఇబ్బంది పడకూడదని ముందుగానే జాగ్రత్తపడింది. దీనికోసం రష్యన్‌ టీవీ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌ కోర్టుల్లో వ్యాజ్యాలను దాఖలు చేసింది.

ఇది కూడా చూడండి: USA:అమెరికాలో మహిళలకు పదవి ఇవ్వరా? అక్కడ కూడా వివక్షేనా?

రోజుకు 1,00,000 రష్యన్ రూబిళ్లతో ఈ ఫైన్ ప్రతి వారం డబుల్ అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఫైన్ కట్టడం గూగుల్​కు ఇదేం మొదటిసారి కాదు. రష్యా కోర్టు ఇలానే తీర్పునిస్తుంది. అందుకని ముందుగానే బ్రిటన్ కోర్టులో దాఖలు చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం చలామణిలో ఉన్న డబ్బు కంటే ఇది చాలా ఎక్కువ. ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్లు కంటే కూడా ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో కట్టడం ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. 

ఇది కూడా చూడండి: I PHONE: చైనాకు షాక్..భారత్‌ కు ఓకే..ఐఫోన్ 17 తయారీ ప్లేస్ మార్పు?

Advertisment