బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. ఈ విషాధ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

New Update
ap crime

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. బాణసంచా తయారీ చేస్తున్న కేంద్రంపై పిడగు పడటంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మరణించారు. ఈ విషాధ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే తణుకు మండలానికి చెందిన రామశివాజీ లైసెన్సు తీసుకుని ఫైర్ వర్క్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పిడుగు పడటంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మృతి చెందారు. మిగతా ఐదుగురు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!

కేరళలోనూ బాణాసంచి వల్ల..

ఇదిలా ఉండగా ఇటీవల బాణా సంచా వల్ల చాలా మంది మరణిస్తున్నారు. కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో ఓ ఆలయంలో కూడా టపాసుల కారణంగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడ్డారు. నీలేశ్వరం ఆలయంలో థేయంకట్ట మహోత్సవాలు జరుగుతుండటంతో ప్రజలు చూడటానికి భారీ సంఖ్యలో వెళ్లారు.

ఇది కూడా చూడండి:  గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

ఈ వేడుకల్లో బాణాసంచా కాల్చడంతో అది వేరే గదిలోకి వెళ్లింది. అప్పటిగే ఆ గదిలో బాణాసంచా నిల్వ ఉంచడతంతో ఈ పేలుడు సంభవించింది. ఎక్కువ మంది జనం ఉండటం వల్ల పేలుడు తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. దీంతో 150 మందికి పైగా గాయపడ్డారు.  

ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే బాణా సంచా కాల్చడానికి ఆలయంలో ఎలాంటి అనుమతి లేకుండానే చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో కూడా బాణాసంచా వల్ల షాప్‌లో మంటలు ఏర్పడ్డాయి. దీపావళి పండుగ వస్తుందంటే టపాసులు వల్ల కొందరు ప్రమాదంలో పడుతుంటారు. పండుగ సమయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. 

ఇది కూడా చూడండి: దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే! 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు