దీపావళి జరుపుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

దీపావళి పండుగ రోజు టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టపాసులోని రసాయనాలు కళ్లు, శరీరానికి హాని కలిగిస్తాయి. కాబట్టి మాస్క్, కళ్లద్దాలు తప్పనిసరిగా ధరించి కాల్చాలి.

New Update
Diwali2

హిందువులకు దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకి లోటు ఉండదని, కోరిన కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. అయితే దీపావళి అంటే కేవలం లక్ష్మీ దేవి పూజ మాత్రమే కాకుండా.. టపాసులు కూడా గుర్తు వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా టపాసులు కాల్చుతారు. అయితే టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో మరి చూద్దాం. 

ఇది కూడా చూడండి:  గూగుల్‌కి రష్యా బిగ్ షాక్.. కారణమేంటంటే?

మాస్క్ తప్పనిసరి..

టపాసులు కాల్చేటప్పుడు తప్పకుండా ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా నుంచి వెలువడే పొగలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ పొగ శరీరంలోకి వెళ్లడం కూడా హానికరం. కాబట్టి మాస్క్ కూడా ధరించాలి. ఈ పొగ కంటిలోకి వెళ్తే దురద, ఇన్ఫెక్షన్, నొప్పి వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చూడండి: బాణసంచా తయారీపై పిడుగు.. ఇద్దరు మృతి

ఎందుకంటే బాణాసంచా నుంచి వెలువడే పొగలో సల్ఫర్, గన్‌పౌడర్ వంటి హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి కార్నియాను దెబ్బతీస్తాయి. కళ్లలోకి పొగ వెళ్తే కొందరు చేతులతో రుద్దేస్తారు. ఇలా చేస్తే కళ్ల నుంచి నీరు కారుతుంది. కాబట్టి ఇలా చేయకుండా కళ్లను శుభ్రమైన నీటితో కడగాలి. అలాగే టపాసులను కాల్చేటప్పుడు కళ్లకు అద్దాలు పెట్టాలి. వీటివల్ల దుమ్ము, ధూళి కణాలు కళ్లలోకి వెళ్లవు. 

ఇది కూడా చూడండి: ఉదయం పూట తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే!

టపాసులు కాల్చేటప్పుడు కేవలం కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. సిల్క్‌గా ఉండే దుస్తులు ధరిస్తే టపాసులు వాటికి అంటుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలకు క్రాకర్స్ అసలు ఇవ్వద్దు. పొరపాటున చేతిలో కాలితే చేతులతో పాటు కళ్లకు కూడా ప్రమాదం. దీనివల్ల పిల్లలు చిన్న వయస్సులోనే దృష్టి లోపంతో ఇబ్బంది పడతారు. 

ఇది కూడా చూడండి: USA:అమెరికాలో మహిళలకు పదవి ఇవ్వరా? అక్కడ కూడా వివక్షేనా?

Advertisment
Advertisment
తాజా కథనాలు