/rtv/media/media_files/2025/03/14/6eL0TryRRN7pbiPC0Gg5.jpg)
Bomb Attack In pakistan
పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. ట్రైన్ హైజాక్ అటాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు. ఈరోజు మళ్ళీ అక్కడ బాంబు దాడి జరిగింది. పాకిస్తాన్ గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్‌లో శుక్రవారం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో స్థానిక ఇస్లామిస్ట్ నాయకుడు, పిల్లలతో సహా ముగ్గురు గాయపడినట్లు తెలుస్తోంది.
రాజకీయ నేతే లక్ష్యంగా..
పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని జామియత్ ఉలేమా ఇస్లాం ఫజల్ రాజకీయ పార్టీ నాయకుడు అబ్దుల్లా నదీమ్ లక్ష్యంగా బాంబ్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో అతనితో పాటూ మరో ముగ్గురు పిల్లలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ నదీమ్ ను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. దీని బాధ్యత ఇప్పటివరకూ ఎవరూ ప్రకటించలేదు.
మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాక్ ఆర్మీతో తమ యుద్ధం కొనసాగుతోందని తెలిపింది. ఖైదీల మార్పిడి ప్రతిపాదనకు 48 గంటల డెడ్‌లైన్ ముగిసిందని, ఇకపై ఏం జరిగినా పాకిస్థాన్ ఆర్మీదే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చింది.
Also Read: AP: పవన్ అన్న అంటూ మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్...