Boeing: బోయింగ్‌లో భారీగా ఉద్యోగాల తొలగింపు...17వేల మంది ఎఫెక్ట్

ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ (Boeing) తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను భారీగా తొలగించేందుకు సిద్ధమైంది. దాదాపు 17,000 మంది సిబ్బందిని తొలగించనుంది. జనవరి తర్వాత వీరందరూ తమ ఉద్యోగాలను మానేయాల్సి ఉంది. 

flight
New Update

Boeing Flights: 

గత కొంతకాలంగా బోయింగ్ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. దాంతో పాటూ వర్కర్లు కూడా సమ్మె చేయడంతో ఉద్యోగులను తీసేయాలని డిసైడ్ అయింది. సియాటెల్‌ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేశారు. దీంతో 737 MAX, 767, 777 జెట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో 5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందని సంస్థ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకొనేందుకు ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించుకుంది. దీతో దాదాపు 17 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.  రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని కంపెనీ ఇది వరకే తెలిపింది. వీరికి ఇప్పటికే పింక్ స్లిప్‌లను ఇచ్చింది.  అమెరికాలో 60 రోజుల గ్రే పీరియడ్ ఉన్న కారణంగా...పింక్ స్లిప్‌లు అందుకున్న వారు అందరూ జనవరి వరకు పని చేస్తారు.

Also Read: సరికొత్త హంగులతో ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాల.. చూస్తే మతిపోవాల్సిందే

Also Read: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 300 విమాన సర్వీసులకు ఆటంకం..

బోయింగ్ వ737 మ్యాక్స్ విమానాలు ఆ సంసథ చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఇండోనేషియా, ఇథియోపియాల్లో రెండు బోయింగ్‌-737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను పక్కనపెట్టారు. తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మరోసారి ఈ ఏడాది  జనవరిలో అలాస్కా ఎయిర్ లైన్స్‌కుచెందిన విమాన డోర్  16 వేల అడుగుల ఎత్తులో ఊడిపడింది.  ఈ ఘటనతో కంపెనీపై నియంత్రణ సంస్థల నిఘా మరింత ఎక్కువైంది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు తీవ్రతరం అవడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి. దాంతో పాటూ బోయింగ్ సీఈవో డేవ్ కాల్హౌన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆపైన కార్మికులు సమ్మెకు దిగారు. ఇవన్నీ కారణాలు బోయింగ్‌ను నష్టాల్లోకి నెట్టేసింది. అందుకే ఇప్పుడు ఉద్యోగులను తగ్గించుకుని వాటిని పూడ్చుకోవాలని అనుకుంటోంది. 

Also Read :  డిస్టెన్స్ రిలేషన్ షిప్‏లో ఈ తప్పులు చేస్తే బంధం ముక్కలే..!

Also Read: ప్రధాని మోదీకి మరో అరుదైన పురస్కారం.. ఏ దేశం ఇవ్వనుందంటే ?

#it-employees-layoffs-2024 #boeing-flight
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe