ట్రంప్‌కు బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో కమలా హారిస్ ముందంజ అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. By B Aravind 03 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయోవా రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోయే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వే అంచనా వేసింది. గతంలో ఇక్కడ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు సర్వే చెప్పింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇప్పుడు అక్కడ ట్రంప్ 44 శాతం మద్దతుతో ఉండగా.. కమలా హారిస్ 47 శాతంతో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ఈ తుది సర్వే డెస్ మోయిన్స్ రిజిస్టర్ వార్తా పత్రికలో ప్రచూరితమైంది. Also read: దారుణం.. 29 మంది చిన్నారులకు ఉరి శిక్ష!.. ఆకలి ఎంతపని చేసింది! ఇద్దరి మధ్య గట్టి పోటీ ఈ మార్పును ఎవరూ ఊహించలేదని.. కమలా హారిస్ అక్కడ స్పష్టమైన మెజార్టీతో ఉన్నారని ఈ పోల్‌ను నిర్వహించిన సెల్జర్ అండ్ కో ప్రెసిడెంట్ జె.ఆన్ సెల్జర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతీ దశలోనూ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వేలు ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారని చెబుతుండగా.. మరికొన్ని కమలా హారిస్ గెలుస్తారని అంచనా వేస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే మొత్తానికి ఈ ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య గట్టి ఉండనుంది. Also Read: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే ఆ పనులు చేసి చూపిస్తా : ట్రంప్ ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో ముందస్తు ఓటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఓటింగ్ ద్వారా దాదాపు 6.1 కోట్ల మంది ప్రజలకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినాలో ట్రంప్, హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. జార్జియాలో హారిస్‌కు 47 శాతం మద్దతు ఉండగా.. ట్రంప్‌నకు 48 శాతం ఉంది. ఇక నార్త్ కరోలినాలో ట్రంప్‌నకు 47 శాతం మద్దతు ఉండగా.. హారిస్‌కు 48 శాతం ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. 2008 నుంచి ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో ఉన్న ఒబామాకు నార్త్ కరోలినా కలిసొచ్చింది. కానీ ఆ తర్వాత రిపబ్లికన్ అభ్యర్థలకు మద్దతిస్తున్నారు. #telugu-news #usa-elections #kamala-harries #trump మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి