/rtv/media/media_files/money8.jpeg)
విదేశీయులు అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి స్వదేశాలకు పంపే సొమ్ము పై విధించిన పన్నులో ట్రంప్ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్‌ఫర్స్ ను ఇంతకు ముందు 5శాతం ప్రతిపాదించగా..ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి తగ్గించనున్నట్టు తెలుస్తోంది. అంటే ఉదాహరణకు రూ.లక్ష స్వదేశానికి పంపితే.. తొలి ప్రతిపాదన ప్రకారం రూ.5 వేలు పన్ను కింద చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.3,500కు తగ్గింది. ఈ పన్నును బ్యాంకులే వసూలు చేసి ప్రభుత్వానికి అందివ్వనున్నాయి. వన్ బిగ్ బ్యూటిపుల్ యాక్ట్ పేరుతో రూపొందించిన ఈ పన్నుల చట్టానికి అమెరికా ప్రతినిధుల సభలో ఫుల్ మెజార్టీ వచ్చింది.
గ్రీన్ కార్డ్, వీసాదారులు అందరికీ వాయింపే..
గ్రీన్ కార్డ్ హోల్డర్ లేదా H1B వీసాపై పని చేయడానికి అక్కడికి వెళ్లిన ప్రతి వలసదారునికి ఈ కొత్త రూల్ వర్తించనుంది. దీని వల్ల దాదాపు 4 కోట్ల మంది వలసదారులు ప్రభావితమవుతారని అంచనాలు వెలువడుతున్నాయి. భారతీయులపై కూడా ఇది అత్యంత ఎక్కువ ప్రభావం చూపించనుంది. భారత్‌కు వచ్చే నగదుకే దాదాపు 1.6 బిలియన్ డాలర్లు పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. అమెరికా నుంచే భారత్‌కు అందుతున్న రెమిటెన్స్‌లు 2010లో 55.6 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2023-24కు 118.7 బి.డాలర్లకు పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27శాతం రాగా.. దానిపై 5శాతం పన్ను అంటే 1.64 బి.డాలర్లు అవుతుంది.
today-latest-news-in-telugu | usa | america president trump | money
Also Read: Pakistan Spy: పాక్ కు గూఢచర్యం..రాజస్థాన్ లో మరో వ్యక్తి అరెస్ట్