BIG BREAKING: బాంగ్లాదేశ్ లో మరో తిరుగుబాటు.. డేంజర్ లో యూనస్ సర్కార్!

బంగ్లాదేశ్ లో మరోసారి నిరసనలు చెలరేగాయి.  అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు ఆందోళనలు చేస్తున్నాయి.  కొత్త విద్యావిధానంపై ఆందోళన చేస్తున్నాయి.

New Update
Potests against  muhammad yunus interim govt in Bangladesh

Potests against muhammad yunus interim govt in Bangladesh

బంగ్లాదేశ్ విద్యావ్యవస్థను సరిదద్ది క్రమంలో అక్కడి తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కొత్త విద్యవిధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది పెద్ద వివాదానికి దారి తీసింది.  బంగ్లాదేశ్ జాతీయ విద్యావిధానంలో భాగంగా ప్రాథమిక పాఠశాల్లో సంగీతం, డాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ అధినేత ముహ్మద్ యూనస్ యంత్రాంగం ప్రతిపాదించింది. దీని ద్వారా పిల్లల్లో కళలు, సాంస్కతిక, సజనాత్మకత పెరుగుతుందని ఆశించింది.  అయితే ఈ విధానాన్ని జమాత్-ఇ-ఇస్లామి, ఖిలాఫత్ మజ్లిస్, బంగ్లాదేశ్ ఖిలాఫత్ ఉద్యమం వంటి రాడికల్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి.  దీనికి నిరసనగా ఆందోళనలను మొదలెట్టాయి. 

మతమే ముఖ్యమంటున్న రాడికల్ గ్రూపులు..

చిన్న వయసులోనే సంగీతం, నృత్యం నేర్పించడం వల్ల మతపరమైన విద్య దెబ్బతింటుందని రాడికల్ గ్రూపులు వాదిస్తున్నాయి.  ఈ కారణంగా పిల్లలు నాస్తికులుగా తయారవుతారని అంటున్నాయి. దాంతో పాటూ ఇస్లాం పట్ల విశ్వాసం కోల్పోతారని చెబుతున్నాయి. ఈ కళల స్థానంలో పాఠశాలల్లో మతపరమైన, నైతిక విద్యను తప్పనిసరి చేయాలని ఇస్లాం గ్రూపులు కోరుతున్నాయి. సంగీతం, డాన్స్ పిల్లల్లో అవినీతి, నైతిక క్షీణతను ప్రోత్సహిస్తాయని ఇస్లామిక్ ఉద్యమ బంగ్లాదేశ్ అమీర్ సయ్యద్ రెజాల్ కరీం అంటున్నారు. 

తమ మాట వినకుండా ప్రైమరీ స్కూళ్ళల్లో ఆర్ట్స్ టీచర్లను నియమిస్తే కచ్చితంగా నిరసనలను పెంచుతామని రాడికల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. మతపరమైన టీచర్లను నియమించే వరకూ ఆందోళనలను ఆపేదే లేదని యునస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి.  ఈ చర్య ఇస్లాం, ఖురాన్ సూత్రాలకు విరుద్ధమని చెబుతున్నారు.  ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్ కాస్త కుదుట పడిందని అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రాడికల్ గ్రూపులు గొడవ చేయడంతో ఇది ఎక్కడ వరకు దారి తీస్తుందో అనే ఆందోళన మొదలైంది. ఈ వివాదం బంగ్లాదేశ్ రాజకీయ, సాంస్కతిక దిశను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. 

గతేడాది అట్టుడికిన బంగ్లాదేశ్.. 

బంగ్లాదేశ్ లో గతేడాది జూలై, ఆగస్టు మధ్యల్లో విపరీతమైన అల్లర్లు చెలరేగాయి. తరువాత  ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో  బంగ్లాదేశ్‌లో 88సార్లు మతపరమైన హింసాత్మక సంఘటనలు జరిగాయి. దీని వలన అక్కడి ప్రభుత్వమే పడిపోయింది. దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయారు. ఇందులో ఎక్కువగా దాడులు హిందువుల మీదనే జరిగాయని చెబుతోంది ఐక్యరాజ్యసమితి. ఇందులో జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో జరిగిన విద్యార్థలు ఆందోళనల్లో మొత్తం 1400 మంది మృతి చెందారని...వారిలో 13శాతం చిన్నారులే అని ఐక్యరాజ్య సమితి నివేదికలో తెలిపింది. బంగ్లాదేశ్‌ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగానే ఎక్కువ మంది మరణించారంది. దీనికి షేక్‌ హసీనా ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పింది.

ఇక షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక...యూనస్ ఖాన్ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి అక్కడ హిందువులు, మైనారిటీల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఠాకుర్‌గావ్, లాల్‌మొనిర్‌హట్, దినాజ్‌పుర్, సిల్హెట్, కుల్నా, రంగ్‌పుర్‌ వంటి చారిత్రక ప్రాంతాలతోపాటు గ్రామాల్లో ఈ దారుణాలు చోటు చేసుకున్నాయి.మత ఘర్షణలకు భయపడి పలు గ్రామాలకు చెందిన సుమారు 3000-4000 మంది హిందువులు భారత్‌ సరిహద్దుకు చేరుకుని అక్కడ ఆశ్రయం పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. దీనికి సంబంధించి హ్యూమన్‌ రైట్స్‌ వయలేషన్స్‌ అండ్‌ అబ్యూజెస్‌ రిలేటెడ్‌ టూ ద ప్రొటెస్ట్స్‌ ఆఫ్‌ జులై అండ్‌ ఆగస్టు 2024 ఇన్‌ బంగ్లాదేశ్ పేరున..ద ఆఫీస్‌ ఆఫ్‌ ద హై కమిషనర్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ ప్యాక్ట్‌-ఫైండింగ్‌ నివేదికను రూపొందించింది. బంగ్లాదేశ్ లో దాడులకు ఎక్కువగా పాల్పడిన వారు అక్కడి నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ లాంటి మత సంస్థలేనని నివేదికలో చెప్పింది. దాడులు కేవలం హిందువుల‌ మీదనే కాక..అక్కడి అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవుల మీద కూడా జరిగిందని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.

Also Read: Trump: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు