/rtv/media/media_files/2025/07/04/new-baba-vanga-2025-07-04-15-42-24.jpg)
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ గురించి తెలిసిందే. ఆమె లాగే జపాన్‌లో రియో టాట్సుకి అనే మహిళ జరగబోయే ప్రమాదాలను ముందే చెబుతుంది. దీంతో అందరూ ఆమెను న్యూ బాబా వంగా అంటూ పిలుస్తున్నారు. ఈ రియోటాట్సుకి రాసిన 1999 మాంగా ‘వాటాషి గ మితా మిరాయ్’ (ది ఫ్యూచర్ ఐ సా అంటే నేను చూసిన భవిష్యత్తు) అనే పుస్తకంలో అంచనాపై జపాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఆమె చెప్పినట్లుగానే గురువారం నైరుతి జపాన్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. రేపు మరో మెగా సునామీ వస్తుందంటూ ఆమె తన జ్యోతిష్యంలో చెప్పారు. దీంతో జపాన్ ప్రజల్లో బాబా వంగా మాటలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. దీంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది. అంతేకాదు అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయంతో వణుకుతున్నారు.
న్యూ బాబా వంగా..
రియో టాట్సుకి (Ryo Tatsuki) ఒక జపనీస్ మాంగా కళాకారిణి. ఆమెను "న్యూ బాబా వాంగా" అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆమె భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలను చెప్పి, అవి నిజమయ్యాయని నమ్ముతారు. ఆమె "ది ఫ్యూచర్ ఐ సా" (The Future I Saw) అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది 1999లో ప్రచురించబడింది. ఇందులో ఆమె తన కలలు, డైరీ ఎంట్రీల ఆధారంగా కొన్ని సంఘటనలను చిత్రాలుగా, రాతపూర్వకంగా పొందుపరిచారు. ఈ పుస్తకం మొదట్లో అంతగా ప్రాచుర్యం పొందలేదు, కానీ 2011లో జపాన్‌లో సంభవించిన సునామీ, భూకంపం తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగింది, ఎందుకంటే ఆమె మార్చి 2011లో ఒక పెద్ద విపత్తు గురించి తన పుస్తకంలో పేర్కొన్నారని ప్రచారం జరిగింది.
రియో టాట్సుకి చెప్పినట్లుగా నమ్ముతున్న కొన్ని అంచనాలు:
1995 కోబె భూకంపం
2011 టోహోకు భూకంపం, సునామీ
ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణం
ప్రిన్సెస్ డయానా మరణం
కోవిడ్-19 మహమ్మారి
తాజాగా, ఆమె 2021లో తన పుస్తకం యొక్క సవరించిన ఎడిషన్‌లో 2025 జూలై 5న జపాన్‌లో ఒక భారీ విపత్తు సంభవించవచ్చని పేర్కొన్నారు. ఇది జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భంలో సంభవించే అగ్నిపర్వత విస్ఫోటనం లేదా టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల మెగా సునామీ లేదా భూకంపం సంభవించవచ్చని ఆమె ఊహించారు.
రియో టాట్సుకి జోస్యాలకు శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ, ఆమె గతంలో చెప్పిన కొన్ని అంచనాలు నిజమవడం వల్ల ప్రజలలో ఆందోళన నెలకొంది. ఆమె భవిష్యత్ అంచనాల కారణంగా జపాన్‌కు పర్యాటకుల బుకింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే, జపాన్ అధికారులు ఈ అంచనాలను నమ్మవద్దని, ఇవి నిరాధారమైనవని పేర్కొన్నారు.
2011 కోబ్ భూకంపం
2011 మార్చి 11న జపాన్ తూర్పు తీరంలో సంభవించిన వినాశకరమైన భూకంపం, సునామీ. ఇది జపాన్ లో ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద భూకంపం, ప్రపంచంలో నాల్గవ అతిపెద్దది. దీని తీవ్రత 9.0 కావడంతో సునామీ సంభవించి, తీరప్రాంత ప్రాంతాల్లో బాగా నష్టం జరిగింది. ముఖ్యంగా ఫుకుషిమా ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రంలో పేలుళ్లు సంభవించాయి. ఈ భారీ భూకంపం, సునామీల కారణంగా దాదాపు 6500 మంది చనిపోయారు. ఈ భారీ భూకంపాన్ని హెచ్చరించిన తర్వాత న్యూ బాబా వంగా ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఆమె అంచనాలపై భారీగా ఉత్కంఠ నెలకొంది.
గతంలో బాబా వంగా.. (1911 అక్టోబర్ 3- 1996 ఆగస్ట్ 11)
బల్గేరియా దేశానికి చెందిన వంగేలియా పాండేవా గుష్టెరోవా బాబా వంగాగా ప్రసిద్ధి. ఆమె కళ్లు కనిపించేవి కానీ.. భవిష్యత్‌లో వచ్చే ప్రమాదాలను గుర్తించగలదన్న ప్రచారం ఉంది. 1911లో జన్మించిన బాబా వాంగాకు 12 సంవత్సరాల వయస్సులో ఒక పెద్ద తుఫాను కారణంగా చూపు కోల్పోయారు. ఆ తర్వాత ఆమెకు అతీంద్రియ శక్తులు వచ్చాయని, భవిష్యత్తులో జరిగే విషయాలను చూడగలిగారని చెబుతారు. ఆమె చెప్పిన జోస్యాలలో చాలావరకు నిజమయ్యాయని నమ్ముతారు. అమెరికాలో జరిగిన 9/11 దాడులు, 2004లో వచ్చిన సునామీ, 2011 జపాన్ భూకంపం, సునామీ వంటి సంఘటనలను ఆమె ముందుగానే ఊహించి చెప్పారని ప్రతీతి. చాలామంది ధనవంతులు, రాజకీయ నాయకులు కూడా ఆమె సలహా కోసం వచ్చేవారు. ఇంత కచ్చితంగా ఆమె ఎలా చెప్పగలిగారనేది ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కావడం లేదు.