/rtv/media/media_files/2025/11/07/girl-friend-2025-11-07-09-03-05.jpg)
కథ..
భూమాదేవి (రష్మిక).. పుట్టగానే తల్లిని పోగొట్టుకుంటోంది. అందుకే తండ్రా ఆమె ఆ పేరు పెడతాడు. తల్లిలేని బిడ్డ కావడంతో గారాబంగా పెంచుతాడు తండ్రి రావు రమేష్. థియేటర్ ఆర్ట్స్, లిటరేచర్‌పై ఉన్న ఇష్టంతో రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఎంఏ లిటరేచర్ జాయిన్ అవుతుంది భూమాదేవి. చదువు తప్ప వేరే ధ్యాస లేని భూమాదేవి.. అనుకోని పరిస్థితుల్లో అదే కాలేజ్‌లో చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కు ఎదురవుతుంది. మొదటి చూపులోనే భూమాని ఇష్టపడతాడు విక్రమ్. దాని తరువాత భూమా ఇష్టపడాల్సి వస్తుంది. ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమ.. హద్దులు దాటేసరికి విక్రమ్‌లోని జెలసీ.. భూమాదేవి స్వేచ్ఛను హరించే స్థాయికి చేరుకుంటుంది. అతనిలోని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తన నుంచి బయటపడటానికి భూమాదేవి పడిన సంఘర్షణే మిగిలిన కథ. ఇదొక టాక్సిక్ ప్రేమకు సంబంధించి కథ.
ఎలా ఉంది..
మొదట నుంచీ విభిన్న సినిమాలను తీస్తూ వచ్చిన రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి వాహ్ అనిపించుకున్నాడు. ప్రేమ కథను ఓ కొత్త కోణంలో ఆవిష్కరించాడు. ప్రేమ కథకు, వుమెన్సెంట్రిక్ ను జోడించి ప్రేక్షకులు ఈ కథకు రిలేట్అయ్యేట్టు చేశారు. కథతో పాటు జర్నీ చేస్తూ.. ఆ కథలో ప్రతీ ఆడపిల్లా తమను తాము చూసుకునేట్టు చేశారు. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సందర్భం మన లైఫ్‌లో జరిగిన వాటిలా అనిపిస్తాయని చూసినవారు చెబుతున్నారు. ఇలాంటి కథ ఆడియెన్స్‌కు చెప్పాలి.. ఒక అమ్మాయిగా నేను ఈ కథకు చాలా కనెక్ట్ అయ్యాను.. బయట ఉన్న అమ్మాయిలు అందరికీ నేను ఇచ్చే బిగ్ హగ్ ఈ సినిమా రష్మిక ప్రమోషన్స్ లో చెప్పింది, అందుకు తగ్గట్టుగానే సినిమాలో నటించి, మెప్పించదని అంటున్నారు.
ప్రేమ కథలను ఇప్పటికే చాలా మంది తీశారు. కానీ ఇలాంటి ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీని చెప్పడం.. చెప్పి పాత్రల్ని ఒప్పించడం పెద్ద టాస్క్. డెప్త్ ఉన్న కథలను పెద్ద తెరపై మెప్పించడం చాలా కష్టం. దీన్ని రాహుల్ రవీంద్రన్ చేసి చూపించారు. తాను చెప్పే కథ.. ప్రతి ప్రేమికుడ్ని, ప్రేమికురాలిని వెంటాడేట్టువెంబడించేట్టు చేశారు. ఓ అమ్మ.. ఓ కూతురు.. ఓ తండ్రి.. ఓ స్నేహితుడు.. ఈ చిత్రంలోని కథను ఈ క్యారెక్టర్లు నడిపిస్తాయి. పాత్రల చుట్టూ తిరిగే కథ కావడంతో ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది. సున్నిత అంశాలకు భావోద్వేగాలను జోడించి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడం రాహుల్ సక్సెస్ అయ్యారు. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ గర్ల్ ఫ్రెండ్ సినిమాకు కనెక్ట్ అవుతారు. సందేశాలు, నీతులు చెప్పకుండా..కథను మాత్రం చెప్పి నిర్ణయం ప్రేక్షకులు మీద వదిలేశారు. రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాకుండా.. ఓ కొత్త తరహా ప్రేమకథను చూపించారు రాహుల్ రవీంద్రన్. కథ, కథనం, మాటలు అతనే కావడంతో చాలా నీట్‌గా ప్రజెంట్ చేశారు.
రష్మిక చించేసింది..
ఈ సినిమా మొత్తం హీరోయిన్ బలం మీదనే నడుస్తుంది. ఇందులో రష్మిక చాలా బాగా చేసిందని ప్రేక్షకులు చెబుతున్నారు. భుమాదేవి పాత్రలో రశ్మిక కనిపించదు.. భూమా అనే పాత్రనే కనిపిస్తుంది. అంతలా లీనమైంది రష్మిక. క్లైమాక్స్‌లో విజృంభించే సీన్ వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ తానే కనిపిస్తూ.. కథకి కొండంత అండగా నిలిచింది. మన మధ్య జరిగింది నీ మీద నాకున్ననమ్మకంరా.. దాన్ని అందరికీ చెప్పుకుంటావ్ ఏంట్రా చెత్త నా కొడకా? అంటూ క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లో ఆమెలోని వీరనారిని చూపించింది. తన బంధకాల్లో నుంచి బయటపడలేక నలిగిపోతున్నట్టుగా.. బాత్ రూం గోడలు దగ్గరకు వచ్చే సింబాలిక్ షాట్‌లో ఏడిపించేసింది రష్మిక. ఇక తండ్రీ కూతుళ్లు మధ్య వచ్చే సీన్‌లకి అయితే థియేటర్స్‌లో అరుపులే. ‘‘నీకు ఇంత ఆపుకోలేనంత ఇది ఉందని తెలిసి ఉంటే.. ఈ కాలేజ్ గీలేజ్ ఎందుకూ..? నీకు అప్పుడే పెళ్లి చేసేసేవాడ్ని కదా? ఎందుకే ఈ అబద్దాలన్నీ ఎందుకు? కాలేజ్‌కి వెళ్లాలి.. హాస్టల్‌కి వెళ్లాలీ.. ఎందుకీ డ్రామాలు? ఇంత క్యారెక్టర్ లెస్ కూతురు నాకెలాపుట్టిందిరా భగవంతుడా? నువ్వు కూడా మీ అమ్మతో పాటు చచ్చుంటేబాగుండేదే?’’ అని రావు రమేష్ చెప్పే డైలాగ్‌కి రీసౌండ్ మామూలుగా లేదు. అాగే నా లైఫ్‌లో నాకేం కావాలోఆలోచించుకోనియ్యి.. ఊపిరాడటం లేదు’ ’ అంటూ గుండెల పగిలేలా ఏడ్చే సీన్‌లో రష్మిక కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. హీరో ఇంటికి వెళ్లి అతని తల్లిని చూసి రియలైజ్ అయ్యే సీన్‌లో ఒళ్లు జివ్వుమనేట్టు చేసింది రష్మిక. అలాగే ఈ సినిమాలో చాలా బలమైన డలాగ్ లు కూడా ఉన్నాయి. నువ్వు ఎవరికి భయపడుతున్నావో తెలియదు కానీ.. అలవాటు చేసుకోకు. నా లైఫ్‌లో నాకేం కావాలోఆలోచించుకోనియ్యి.. ఊపిరాడటం లేదు లాంటి డైలాగ్స్ తో దర్శకుడు కేక పెట్టించాడు.
ఇతర పాత్రల్లో..
దసరా సినిమాతో తెలుగు ఆడియన్స్ దగ్గరైన దీక్షిత్ శెట్టి.. సినిమాలో విలక్షణమైన పాత్రలో కనిపించారు. మల్టీ షేడ్స్ లో నటిస్తూ మెప్పించాడు. దుర్గగా అను ఇమ్మానుయేల్ మరో ఇంపార్టెంట్రోల్ చేసింది. స్టైలిష్ అండ్ బోల్డ్ పాత్రలో మెప్పించడంతో పాటు.. కథానాయిక తన గమ్యం చేరడంలో సాయం అందించి కీలకంగా నిలిచింది. దర్శకుడిగానే కాకుండా.. ప్రొఫెసర్‌గానూ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి మెప్పించారు రాహుల్ రవీంద్రన్. రోహిణి ఒకే ఒక్క సీన్‌లో కనిపిస్తుంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే.. చూపు తిప్పుకోకుండా తనవైపేచూసేట్టుగా ఆ సీన్‌లో చింపేసింది రోహిణి. హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించిన రావు రమేష్.. ‘ఆర్ఎక్స్ 100, కొత్త బంగారులోకం వంటి సినిమాల్లోను తన నటనను గుర్తు చేశారు.
మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మికకు రో సూప్ హిట్ దక్కినట్టే. అలాగే మంచి కలను ఒడిసి పట్టే అల్లు అరవింద్ కు కూడా ఈ సినిమా ంచివసూళ్ళనే ఇస్తుంది. ఒక నిర్మాతగా కోట్లు సంపాదించాను.. కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ద్వారా డబ్బు కంటే సంతృప్తిని ఎక్కువ సంపాదించాను’ అని ముందే చెప్పిన అల్లు అరవింద్.. ఆయన సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడిలను నిర్మాతలుగా పెట్టారు.
Follow Us